*అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.* • సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహాస్వామి, శ్రీకూర్మం కూర్మనాధస్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారం. • ఏపీ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. • విమానాశ్రయం ప్రారంభోత్సవం సహా మొత్తంగా రూ. 18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. • అభివృద్ధిలో రికార్డులు సాధించడమే కాదు... థింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉంది. • 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు థింసా నృత్యంతో రికార్డులు సృష్టించిన వారికి అభినందనలు. • అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇది.. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి తన ప్రాణాలను అర్పించారు. • అల్లూరి పేరుతో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించడం సంతోషంగా ఉంది. • ఉత్తరాంధ్ర యువత అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు ఓ రన్ వేలా, ఓ లాంచ్ ప్యాడ్ లా పని చేస్తుంది. • గతంలో ఎయిర్ పోర్టులకు ఓ కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవి... కానీ మేం వచ్చాక ఆ పద్దతిని మార్చాం. • అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేర్లతో ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేశాం. • భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించాం. • అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టాం. • గతంలో 74 ఎయిర్ పోర్టులు ఉండేవి.. కానీ ఇప్పుడు 166 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. • ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయి. • ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించింది. • స్మోక్ ఎయిర్ పోర్టు మోడల్ కాశీ నుంచి అమృత్ సర్ వరకు విస్తరించింది... దీని వల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించారు... పంజాబ్ కు అభినందనలు • డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండేలా ప్రజలు ఆశీర్వదించారు. • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ టీమ్ రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోంది. • కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. • విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరిస్తున్నాం. • మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. • విశాఖ-రాయపూర్ ఎక్స్ ప్రెస్ వే ద్వారా అభివృద్ధి చేస్తున్నాం.. జాతీయ రహదారులతో వేగం పెంచుతున్నాం. • రూ. 1 లక్ష కోట్ల ఖర్చుతో రైల్వే కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయి.. వివిధ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాం. • 70కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. • పీఎం గతి శక్తి-మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి చేస్తున్నాం. • ఆధునిక లాజిస్టిక్ నెట్ వర్క్ ద్వారా రైతులకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపయోగం ఉంటుంది. • భవిష్యత్తును ఆలోచించి దానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. • సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఇక్కడి యువతకు మంచి టాలెంట్ ఉంది. • దీన్ని దృష్టిలో ఉంచుకునే విశాఖలో సెమీ కండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ ప్లాంట్ ను శంకుస్థాపన చేశాం. • సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాఫ్ట్ వేర్ రంగంలోనే కాకుండా.. మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ అభివృద్ధి జరుగుతుంది... యువతు ఉపాధి లభిస్తుంది. • అభివృద్ధికి కావాల్సిన ఎకో సిస్టంను ఏర్పాటు చేసేందుకు మేం సహకరిస్తున్నాం. • సీఎం చంద్రబాబు రాత్రి పగలు కష్టపడి చేస్తున్న కృషి వల్లే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. • సెమీ కండక్టర్ పరిశ్రమతో పాటు.. ఏఐ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు వస్తున్నాయి. • గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది... అలాగే చాలా అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. • ఇవన్నీ ఏపీ యువతతోపాటు.. దేశంలోని యువతకు ఉపాధి లభించబోతోంది. • నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ఫార్మా పార్క్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది... దేశంలో ఏపీ ప్రముఖ ఫార్మా హబ్ కానుంది. • రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. • ఏపీ అభివృద్ధి కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాత్రి-పగలు కష్టపడి డబులింజన్ సర్కార్ పని చేస్తుంది. • ఏపీలో అభివృద్ధిలో చాలా వేగంగా పని చేస్తుంది. • గత 3 ఏళ్ల పర్యటనల్లో నేను రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. • ఏపీ అభివృద్ధి యాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విశాఖ ఎకనమిక్ రీజియన్ కీలకం కానుంది. • విశాఖ ఎకనమిక్ రీజియన్ ఆసియా ఖండంలో అతి ముఖ్యమైన కేంద్రంగా మారబోతోంది... దీనికి అన్ని రకాల చర్యలు కేంద్రం తీసుకుంటోంది. • పెట్టుబడుల నుంచి ఉపాధి అనేది ఎన్డీఏ లక్ష్యం. ప్రభుత్వ పరంగా దీనికి చర్యలు తీసుకుంటున్నాం. • పెట్టుబడులు పెరిగితే.. ఉత్పత్తి పెరుగుతుంది.. ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి.. ఎగుమతులు పెరిగితే ఉపాధి పెరుగుతుంది. అప్పుడు ప్రజల జీవితాలు మెరుగవుతాయి. • ఇవాళ ఏపీలో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులన్నీ స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తాయి.
*అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.* • సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహాస్వామి, శ్రీకూర్మం కూర్మనాధస్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారం. • ఏపీ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. • విమానాశ్రయం ప్రారంభోత్సవం సహా మొత్తంగా రూ. 18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. • అభివృద్ధిలో రికార్డులు సాధించడమే కాదు... థింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉంది. • 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు థింసా నృత్యంతో రికార్డులు సృష్టించిన వారికి అభినందనలు. • అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇది.. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి తన ప్రాణాలను అర్పించారు. • అల్లూరి పేరుతో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించడం సంతోషంగా ఉంది. • ఉత్తరాంధ్ర యువత అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు ఓ రన్ వేలా, ఓ లాంచ్ ప్యాడ్ లా పని చేస్తుంది. • గతంలో ఎయిర్ పోర్టులకు ఓ కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవి... కానీ మేం వచ్చాక ఆ పద్దతిని మార్చాం. • అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్ లో
సంత్ రవిదాస్ పేర్లతో ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేశాం. • భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించాం. • అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టాం. • గతంలో 74 ఎయిర్ పోర్టులు ఉండేవి.. కానీ ఇప్పుడు 166 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. • ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయి. • ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించింది. • స్మోక్ ఎయిర్ పోర్టు మోడల్ కాశీ నుంచి అమృత్ సర్ వరకు విస్తరించింది... దీని వల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించారు... పంజాబ్ కు అభినందనలు • డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండేలా ప్రజలు ఆశీర్వదించారు. • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ టీమ్ రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోంది. • కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. • విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరిస్తున్నాం. • మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. • విశాఖ-రాయపూర్ ఎక్స్ ప్రెస్ వే ద్వారా అభివృద్ధి చేస్తున్నాం.. జాతీయ రహదారులతో వేగం పెంచుతున్నాం. • రూ. 1 లక్ష కోట్ల ఖర్చుతో రైల్వే
కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయి.. వివిధ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాం. • 70కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. • పీఎం గతి శక్తి-మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి చేస్తున్నాం. • ఆధునిక లాజిస్టిక్ నెట్ వర్క్ ద్వారా రైతులకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపయోగం ఉంటుంది. • భవిష్యత్తును ఆలోచించి దానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. • సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఇక్కడి యువతకు మంచి టాలెంట్ ఉంది. • దీన్ని దృష్టిలో ఉంచుకునే విశాఖలో సెమీ కండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ ప్లాంట్ ను శంకుస్థాపన చేశాం. • సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాఫ్ట్ వేర్ రంగంలోనే కాకుండా.. మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ అభివృద్ధి జరుగుతుంది... యువతు ఉపాధి లభిస్తుంది. • అభివృద్ధికి కావాల్సిన ఎకో సిస్టంను ఏర్పాటు చేసేందుకు మేం సహకరిస్తున్నాం. • సీఎం చంద్రబాబు రాత్రి పగలు కష్టపడి చేస్తున్న కృషి వల్లే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. • సెమీ కండక్టర్ పరిశ్రమతో పాటు.. ఏఐ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు వస్తున్నాయి. • గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది... అలాగే చాలా అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. • ఇవన్నీ ఏపీ యువతతోపాటు.. దేశంలోని యువతకు ఉపాధి లభించబోతోంది. • నక్కపల్లిలో
కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ఫార్మా పార్క్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది... దేశంలో ఏపీ ప్రముఖ ఫార్మా హబ్ కానుంది. • రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. • ఏపీ అభివృద్ధి కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాత్రి-పగలు కష్టపడి డబులింజన్ సర్కార్ పని చేస్తుంది. • ఏపీలో అభివృద్ధిలో చాలా వేగంగా పని చేస్తుంది. • గత 3 ఏళ్ల పర్యటనల్లో నేను రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. • ఏపీ అభివృద్ధి యాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విశాఖ ఎకనమిక్ రీజియన్ కీలకం కానుంది. • విశాఖ ఎకనమిక్ రీజియన్ ఆసియా ఖండంలో అతి ముఖ్యమైన కేంద్రంగా మారబోతోంది... దీనికి అన్ని రకాల చర్యలు కేంద్రం తీసుకుంటోంది. • పెట్టుబడుల నుంచి ఉపాధి అనేది ఎన్డీఏ లక్ష్యం. ప్రభుత్వ పరంగా దీనికి చర్యలు తీసుకుంటున్నాం. • పెట్టుబడులు పెరిగితే.. ఉత్పత్తి పెరుగుతుంది.. ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి.. ఎగుమతులు పెరిగితే ఉపాధి పెరుగుతుంది. అప్పుడు ప్రజల జీవితాలు మెరుగవుతాయి. • ఇవాళ ఏపీలో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులన్నీ స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తాయి.
- *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామ్మోహన్ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...1
- కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.1
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.1
- నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.1
- ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.1
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1