logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

FCI నల్గొండ డివిజన్ కార్యాలయంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు.... క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు గాను భారత ఆహార సంస్థ (FCI) నల్గొండ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణుడు , కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. ఎల్. రోహిత్ రెడ్డి పాల్గొని క్యాన్సర్ నివారణ, జాగ్రత్తలు మరియు ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా డా. రోహిత్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గురించి సమాజంలో సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్సతో నయం చేసుకోవచ్చని వివరించారు. నల్గొండ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు కె. కృష్ణమూర్తి, సజిత్ కుమార్, కాశిరెడ్డి, ధీరజ్, భవిత్ కుమార్, ఆదిమల్ల శంకర్ మరియు ఉద్యోగులు సతీష్ రెడ్డి, హిమబిందు, స్రవంతి, దివ్య, నిఖిల్, జనార్ధన్, స్వాతి, నిర్వాహకులు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Deevana
Deevana
Local News Reporter నార్కెట్‌పల్లి, నల్గొండ, తెలంగాణ•
1 day ago
b22f25f2-0338-4394-9f8d-77a39498d1e6

FCI నల్గొండ డివిజన్ కార్యాలయంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు.... క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు గాను భారత ఆహార సంస్థ (FCI) నల్గొండ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణుడు , కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. ఎల్. రోహిత్ రెడ్డి పాల్గొని క్యాన్సర్ నివారణ, జాగ్రత్తలు మరియు ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా డా. రోహిత్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గురించి సమాజంలో సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్సతో నయం చేసుకోవచ్చని వివరించారు. నల్గొండ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు కె. కృష్ణమూర్తి, సజిత్ కుమార్, కాశిరెడ్డి, ధీరజ్, భవిత్ కుమార్, ఆదిమల్ల శంకర్ మరియు ఉద్యోగులు సతీష్ రెడ్డి, హిమబిందు, స్రవంతి, దివ్య, నిఖిల్, జనార్ధన్, స్వాతి, నిర్వాహకులు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.
    1
    నల్గొండ జిల్లా..
మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం..
99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్..
2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..
స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్..
చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు..
పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం..
వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.
    user_Deevana
    Deevana
    Local News Reporter నార్కెట్‌పల్లి, నల్గొండ, తెలంగాణ•
    13 hrs ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    9 hrs ago
  • యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ​తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి,
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
​తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
    1
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం  రెండు సంవత్సరాల క్రితం  ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు  ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక  ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.  ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు  మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు  1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి  నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
    3
    *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు*
హైదరాబాద్: జిహెచ్ఎంసి  శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 
99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది.
ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది
స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు
ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో  సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు 
చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
    1
    రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి! వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ​మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
    2
    వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి!
వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
​మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.