logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలకు వేములవాడ దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదవ శుక్రవారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని వివరించారు.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలకు వేములవాడ దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస

పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదవ శుక్రవారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని వివరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలకు వేములవాడ దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదవ శుక్రవారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని వివరించారు.
    2
    శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలకు వేములవాడ దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు 
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ  తెలిపారు.
శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదవ శుక్రవారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని వివరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    2
    తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు 
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
    2
    కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు.
సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • 27వ డివిజన్‌లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ ⁠ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. - కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. చట్టాలు – ఉల్లంఘనలు: నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం. మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యం: ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. AIFB ప్రధాన డిమాండ్లు: 1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి. 2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి. 4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
    2
    27వ డివిజన్‌లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్
⁠ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్.
- కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు.
ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
చట్టాలు – ఉల్లంఘనలు:
నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం.
మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది.
అధికారుల బాధ్యతారాహిత్యం:
ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు.
AIFB ప్రధాన డిమాండ్లు:
1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి.
2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి.
4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది.
ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు సన్నాహాలు. ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారికి వినతి. పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిడాల భూపతికి అప్పగించారు. మంగళవారం పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఎన్నికల అధికారికి అప్పగించారు. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతిని కోరారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ త్వరలోనే యువజన సంఘానికి సంబంధించిన తుది సభ్యుల జాబితాతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
    3
    పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు సన్నాహాలు.
ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారికి వినతి.

పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిడాల భూపతికి అప్పగించారు. మంగళవారం పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఎన్నికల అధికారికి అప్పగించారు. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతిని కోరారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ త్వరలోనే యువజన సంఘానికి సంబంధించిన తుది సభ్యుల జాబితాతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    42 min ago
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    1
    ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ 
ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • అన్నం పెట్టిన వారిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది పోచారం గారు అన్నం పెట్టినవారిని మోసం చెయ్యాలని చూస్తే ఇలానే ఉంటది పోచారం గారు.. మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు.. అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరా.! ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదు.. సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పిన మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు. ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కండువా కుప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు. బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు. నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేల తో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా.. నేను నీకు అమ్ముడుపోయానా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని అడిగాను. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం, మంత్రులుభట్టి,పొంగులేటికి చెప్పిన నిధులు మంజూరు కావడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలువినడం లేదు వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదు వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ అటెండ్ చేయడం లేదు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చిపోలేను. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చింది.
    1
    అన్నం పెట్టిన వారిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది పోచారం గారు 
అన్నం పెట్టినవారిని మోసం చెయ్యాలని చూస్తే ఇలానే ఉంటది పోచారం గారు..
మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు..
అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరా.!
ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదు..
సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పిన మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదు..
కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు.
నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు.
ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కండువా కుప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు.
బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు.
నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేల తో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా..
నేను నీకు అమ్ముడుపోయానా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని అడిగాను.
మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు..
నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం, మంత్రులుభట్టి,పొంగులేటికి  చెప్పిన నిధులు మంజూరు కావడం లేదు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలువినడం లేదు
వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదు
వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ అటెండ్ చేయడం లేదు.
కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది.
అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చిపోలేను. 
అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చింది.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు.‌ దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.
    2
    కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక
కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు.‌ దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని  అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.