logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిల్లి అడ్డొచ్చిందని సడన్ బ్రేక్.. ఆటో బోల్తా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. మొక్కలు నాటేందుకు పది మంది మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోకు పిల్లి అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పిన ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆరుగురికి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

20 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
20 hrs ago
855c86b1-74a2-48d0-aad8-c5017933a53e
92be7867-3185-4ef2-bf20-658ac92308e7
cd78d1a6-2bff-4a12-a34e-9b6b98575401
aeefbbf9-6fbc-4c36-b2e0-4a4a80b06a0c

పిల్లి అడ్డొచ్చిందని సడన్ బ్రేక్.. ఆటో బోల్తా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. మొక్కలు నాటేందుకు పది మంది మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోకు పిల్లి అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పిన ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆరుగురికి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

More news from తెలంగాణ and nearby areas
  • ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ****
ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్ గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    1
    రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్

లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్
గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం 
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి
ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
    1
    భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి.....................
భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆలయ ఎప్పుడు నిర్మాణానికి భక్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ధన రూపేనా, వస్తురూపేనా సహాయ సహకారాలు అందించి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు ,మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    4
    సాకేతపురి దాసాంజనేయ స్వామి  ఆలయంలో  మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో  మంగళవారం సందర్భంగా  . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో   శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే  ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం  జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఆలయ  పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆలయ ఎప్పుడు నిర్మాణానికి భక్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ధన రూపేనా, వస్తురూపేనా సహాయ సహకారాలు అందించి  ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు ,మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • భద్రాచలం: తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ దీక్ష.. న్యాయం కోసం కూతురి పోరాటం... భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చ నీయాంశంగా మారింది. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తన తండ్రి తనను దూరం చేశారని దీక్షకు దిగిన మహిళ ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిని కూడా భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని ఆరోపించింది. కుటుంబ సమస్యపై పలువురిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ప్రభావశీలుల అండదండల కారణంగా తమకు న్యాయం దక్కడం లేదని పేర్కొంది. దీంతో న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. అధికారులు స్పందించి ఇరువర్గాల వాదనలు విని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    భద్రాచలం: తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ దీక్ష.. న్యాయం కోసం కూతురి పోరాటం...
భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చ నీయాంశంగా మారింది. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తన తండ్రి తనను దూరం చేశారని దీక్షకు దిగిన మహిళ ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిని కూడా భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని ఆరోపించింది.
కుటుంబ సమస్యపై పలువురిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ప్రభావశీలుల అండదండల కారణంగా తమకు న్యాయం దక్కడం లేదని పేర్కొంది. దీంతో న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. అధికారులు స్పందించి ఇరువర్గాల వాదనలు విని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 hrs ago
  • అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా...
బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆప్యాతలు కొలువైనను గడ్డ శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి గడ్డపై ఇలాంటి రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా..... ??? తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై న్యాయం కోసం ఆడబిడ్డ ఆవేదన తల్లి దండ్రుల కుటుంబ వివాదంలో తనను దూరం చేశారంటూ కూతురి ఆవేదన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారిన మహిళ నిరసన భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి నేలపై, తన తండ్రి ప్రేమ కోసం ఓ ఆడబిడ్డ న్యాయం కోరుతూ దీక్షకు కూర్చోవడం పలువురిని కలచివేస్తోంది. దీక్షకు కూర్చున్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తనను తండ్రి దూరం చేశారని ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై తీవ్ర ఆరోపణలు తన తల్లి దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని కూతురు ఆరోపించింది. భర్త తన తల్లిని మానసికంగా వేధించడంతో పాటు, ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించారని తెలిపింది. అయితే తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా తన తల్లిని భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం దీక్ష తమ సమస్యను పలువురి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. తండ్రి ప్రేమ కోసం కూతురు రోడ్డుపై దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కుటుంబం వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇరువర్గాల వాదనలు పూర్తిస్థాయిలో తెలుసుకొని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. రాముడు నడయాడిన నేలపై.. తండ్రి ప్రేమ కోసం కూతురి కన్నీటి పోరాటం.
    1
    ఆప్యాతలు కొలువైనను గడ్డ శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి గడ్డపై ఇలాంటి రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా..... ??? 
తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష
రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై న్యాయం కోసం ఆడబిడ్డ ఆవేదన
తల్లి దండ్రుల కుటుంబ వివాదంలో తనను దూరం చేశారంటూ కూతురి ఆవేదన
భద్రాచలంలో చర్చనీయాంశంగా మారిన మహిళ నిరసన
భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి నేలపై, తన తండ్రి ప్రేమ కోసం ఓ ఆడబిడ్డ న్యాయం కోరుతూ దీక్షకు కూర్చోవడం పలువురిని కలచివేస్తోంది.
దీక్షకు కూర్చున్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తనను తండ్రి దూరం చేశారని ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
భర్తపై తీవ్ర ఆరోపణలు
తన తల్లి దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని కూతురు ఆరోపించింది. భర్త తన తల్లిని మానసికంగా వేధించడంతో పాటు, ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించారని తెలిపింది. అయితే తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది.
కొన్నేళ్లుగా తన తల్లిని భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
న్యాయం కోసం దీక్ష
తమ సమస్యను పలువురి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది.
తండ్రి ప్రేమ కోసం కూతురు రోడ్డుపై దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ కుటుంబం వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇరువర్గాల వాదనలు పూర్తిస్థాయిలో తెలుసుకొని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
రాముడు నడయాడిన నేలపై.. తండ్రి ప్రేమ కోసం కూతురి కన్నీటి పోరాటం.
    user_Radhika
    Radhika
    Tailor భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 hrs ago
  • వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. ఇల్లందు క్రాస్‌రోడ్‌లో మొక్కలు నాటిన కలెక్టర్ అంకిత్... కొత్తగూడెం: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్‌రోడ్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. ఇల్లందు క్రాస్‌రోడ్‌లో మొక్కలు నాటిన కలెక్టర్ అంకిత్...
కొత్తగూడెం: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్‌రోడ్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.