logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

5 hrs ago
user_Tharun
Tharun
Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
5 hrs ago

****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *​ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: ​సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ​ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ​పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ​ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు*


*​ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):*
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
​గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు:
​సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
​ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
​పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు.
​ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు.
జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర 
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.
    1
    తిరుమలాయపాలెం  ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు.
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.
    1
    విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు
విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.బండమీది తండాకు చెందిన భూక్యా మంగ్యా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 21 న నిందితులు తాళం పగులగొట్టి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.చోరీ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిన్నెర మధు,ముదిగొండ వెంకన్నను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు.
    1
    కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు
ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.బండమీది తండాకు చెందిన భూక్యా మంగ్యా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 21 న నిందితులు తాళం పగులగొట్టి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.చోరీ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిన్నెర మధు,ముదిగొండ వెంకన్నను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి సీఐ  సంజీవ్ తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం. అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు. కారులో టాయ్ పిస్టల్ : బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో  విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు
అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం.
అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది.
అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు.
కారులో టాయ్ పిస్టల్ :  బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
    1
    వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్
గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    4 hrs ago
  • సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. దీనితోసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో బత్తలపల్లిలో విషాదం నెలకొంది టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. శ్రీశైలంలో ఓ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు.మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నారు. 14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి, మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం
    1
    సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. దీనితోసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో బత్తలపల్లిలో విషాదం నెలకొంది టీచర్స్ కాలనీకి చెందిన  ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు.
శ్రీశైలంలో ఓ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు.మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నారు. 14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి, మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.