logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఆర్టీసీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగాలి ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు ఐపీఎస్ టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడిన ఎస్పీ, ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులను తెలుసుకున్నారు. సమ్మె ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సహించబోమని హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట డియస్పీ ప్రసన్న కుమార్, డిపో మేనేజర్ సురేఖ, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
3 hrs ago

బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఆర్టీసీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగాలి ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు ఐపీఎస్ టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడిన ఎస్పీ, ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులను తెలుసుకున్నారు. సమ్మె ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సహించబోమని హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట డియస్పీ ప్రసన్న కుమార్, డిపో మేనేజర్ సురేఖ, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్, సిద్దిపేట జిల్లా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
    2
    గజ్వేల్, సిద్దిపేట జిల్లా
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • పిల్లల సమగ్ర అభివృద్ధి తల్లిదండ్రుల లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్యం అన్నారు. సంగారెడ్డి లోని బీసీ గురుకుల పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. వేసవి సెలవుల్లో పిల్లల పత్ర ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
    1
    పిల్లల సమగ్ర అభివృద్ధి తల్లిదండ్రుల లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్యం అన్నారు. సంగారెడ్డి లోని బీసీ గురుకుల పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. వేసవి సెలవుల్లో పిల్లల పత్ర ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
    1
    గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    1
    కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।
    1
    गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव
उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।
    user_दानिश शेख
    दानिश शेख
    New Hafeezpet•
    13 hrs ago
  • ప్రచురణార్థం మెదక్ 23 ఏప్రిల్ 2026 భగీరథ మహర్షి త్యాగం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. **ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *భగీరథ మహర్షి జయంతి* వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్* హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సగర వంశీయులైన భగీరథ మహర్షి గంగా నదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి అని కొనియాడారు. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గంగానదిని భూమికి తెచ్చిన మహనీయుడిగా భగీరథుని చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అందుకే గొప్ప ప్రయత్నాలను ‘భగీరథ ప్రయత్నం’గా పిలుస్తారని వివరించారు. అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి, డిపిఓ యాదయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో యూనస్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గంగా కిషన్, సంఘ నాయకులు జిల్లా అధ్యక్షుడు సాయిలు ఉప్పల సాగర సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    1
    ప్రచురణార్థం 
మెదక్ 23 ఏప్రిల్ 2026
భగీరథ మహర్షి త్యాగం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
**ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు*
*జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *భగీరథ మహర్షి జయంతి* వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి *అదనపు కలెక్టర్ నగేష్  తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్* హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సగర వంశీయులైన భగీరథ మహర్షి గంగా నదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి అని కొనియాడారు. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గంగానదిని భూమికి తెచ్చిన మహనీయుడిగా భగీరథుని చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అందుకే గొప్ప ప్రయత్నాలను ‘భగీరథ ప్రయత్నం’గా పిలుస్తారని వివరించారు.
అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో  డీఎఫ్ఓ జోజి, డిపిఓ యాదయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో యూనస్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గంగా కిషన్, సంఘ నాయకులు జిల్లా అధ్యక్షుడు సాయిలు  ఉప్పల సాగర సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    5 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజైన గురువారం కొత్త బస్టాండ్ ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.
    1
    ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజైన గురువారం కొత్త బస్టాండ్ ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.