Shuru
Apke Nagar Ki App…
గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
KHADEER REPORTER
గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం1
- గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పుడు మాటలను విని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బానిసై చట్టాలను గౌరవించకుండా కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీసే ఘోష్ కమిషన్ ఇచ్చిన అబద్ధపు అసత్యపు నివేదికలను తెలంగాణ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు గోష్ కమిషన్ నివేదికను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వనికి తెలంగాణ హైకోర్టు నియమించిన ఘోష్ కమిషన్ ఫేక్ కమిషన్ అని,దొల్ల కమిషన్ అని, తీర్పునివ్వడం యావత్ తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని రైతుల విజయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాన్ని చేయడానికి రైతులను రాజును చేయడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాలేశ్వరం, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలం చేసి, రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు నాణ్యమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేసి రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలను కల్పిస్తూ కొనుగోలు చేసి రైతును ఆర్థికంగా బలోపేతం చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి నాయకునిపై బురద గెలవడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ కాలేశ్వరం కూలిపోయిందని ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టాల నిర్వీర్యం చేస్తూ కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ అత్యున్నత న్యాయస్థానాలు మొట్టికాయలు పెట్టిన చట్టాల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అవినీతి అక్రమాలు భూకబ్జాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ తెలంగాణ పరువు ప్రతిష్టను మంట కలుపుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి మండుటెండల్లో సైతం సాగునీరు అందించారన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలంలో రెండు ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కమిషన్ల పేరిట, దర్యాప్తుల పేరిట కాలయాపన చేయడం మానుకోవాలని హితవ్ పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మేరా, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్ గోలీ మమతా సంతోష్, మామిడి శ్రీధర్, మన్నె రూపా వెంకటేష్, కనకసేన, కోట బాబు, కప్ప మమత సంతోష్ మరికంటి కనకయ్య మాజీ కో ఆప్షన్ ఉమర్, నాయకులు అహ్మద్ హనుమంత్ రెడ్డి స్వామి చారి శివ తదితరులున్నారు.4
- తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.1
- Post by User4017 Budhiya Kan ke2
- *** For info/ Scrolling: సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లోని "ఆజాద్ - సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ & ఇన్నోవేషన్ సెంటర్"లో 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన "ది ఎక్స్ క్లూజివ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్"ను గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ "బేకర్ హ్యూస్"...ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్& ఎక్విప్ మెంట్(వోఎఫ్ సీఈ), ఇండస్ట్రియల్ & ఎనర్జీ టెక్నాలజీ(ఐఈటీ), టెక్నాలజీ & డిజిటల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ యూనిట్ లో బేకర్ హ్యూస్.... ఇండస్ట్రియల్ & ఎనర్జీ టెక్నాలజీ (IET) విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్(High-Precision) ఉత్పత్తులు తయారవుతాయి. కొత్తగా 230 హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కి ఉపాధి లభిస్తుంది. తయారీ రంగంలో "మేడ్ ఇన్ తెలంగాణ" మరింత విశ్వవ్యాప్తం అవుతుంది.1
- ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి1
- గజ్వేల్, సిద్దిపేట జిల్లా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.2