Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం: జేఏసీ నేత ఆశ్వధామ రెడ్డి ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Telangana news
ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం: జేఏసీ నేత ఆశ్వధామ రెడ్డి ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Privue |India Pharma Exp 2026|Hitex Exhibition Centre Hyderabad.1
- గజ్వేల్, సిద్దిపేట జిల్లా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.2
- తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సంగారెడ్డిలో జహీరాబాద్ డిపో ఆర్టీసీ బస్సును అడ్డుకున్న కార్మికులు, పోలీసుల జోక్యంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది1
- పిల్లల సమగ్ర అభివృద్ధి తల్లిదండ్రుల లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్యం అన్నారు. సంగారెడ్డి లోని బీసీ గురుకుల పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. వేసవి సెలవుల్లో పిల్లల పత్ర ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.1
- రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010. పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. సహకార సంఘాల పాత్రపై సూచనలు సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. మెదక్ జిల్లా సాగు అంచనాలు మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.1
- నా భార్య ఏం పాపం చేసింది.. ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి ఆంధ్రప్రభ పత్రిక పేరుతో నా భార్య మీద తప్పుడు వార్తలు రాసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి పొంగులేటి ఆక్రమణ మైనింగ్ మీద ప్రశ్నించినందుకు, మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్ల ఫోన్ స్కామ్ బైటపెట్టినందుకు.. నా భార్య మీద కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారు గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా మా మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు - బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్1
- Privue |India Pharma Exp 2026|Hitex Exhibition Centre Hyderabad.1
- ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజైన గురువారం కొత్త బస్టాండ్ ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.1