రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా లక్ష్యం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010. పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. సహకార సంఘాల పాత్రపై సూచనలు సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. మెదక్ జిల్లా సాగు అంచనాలు మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

- బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఆర్టీసీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగాలి ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు ఐపీఎస్ టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడిన ఎస్పీ, ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులను తెలుసుకున్నారు. సమ్మె ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సహించబోమని హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట డియస్పీ ప్రసన్న కుమార్, డిపో మేనేజర్ సురేఖ, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పుడు మాటలను విని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బానిసై చట్టాలను గౌరవించకుండా కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీసే ఘోష్ కమిషన్ ఇచ్చిన అబద్ధపు అసత్యపు నివేదికలను తెలంగాణ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు గోష్ కమిషన్ నివేదికను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వనికి తెలంగాణ హైకోర్టు నియమించిన ఘోష్ కమిషన్ ఫేక్ కమిషన్ అని,దొల్ల కమిషన్ అని, తీర్పునివ్వడం యావత్ తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని రైతుల విజయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాన్ని చేయడానికి రైతులను రాజును చేయడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాలేశ్వరం, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలం చేసి, రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు నాణ్యమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేసి రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలను కల్పిస్తూ కొనుగోలు చేసి రైతును ఆర్థికంగా బలోపేతం చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి నాయకునిపై బురద గెలవడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ కాలేశ్వరం కూలిపోయిందని ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టాల నిర్వీర్యం చేస్తూ కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ అత్యున్నత న్యాయస్థానాలు మొట్టికాయలు పెట్టిన చట్టాల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అవినీతి అక్రమాలు భూకబ్జాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ తెలంగాణ పరువు ప్రతిష్టను మంట కలుపుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి మండుటెండల్లో సైతం సాగునీరు అందించారన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలంలో రెండు ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కమిషన్ల పేరిట, దర్యాప్తుల పేరిట కాలయాపన చేయడం మానుకోవాలని హితవ్ పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మేరా, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్ గోలీ మమతా సంతోష్, మామిడి శ్రీధర్, మన్నె రూపా వెంకటేష్, కనకసేన, కోట బాబు, కప్ప మమత సంతోష్ మరికంటి కనకయ్య మాజీ కో ఆప్షన్ ఉమర్, నాయకులు అహ్మద్ హనుమంత్ రెడ్డి స్వామి చారి శివ తదితరులున్నారు.4
- Post by Vishwamber Rao2
- సంగారెడ్డి, మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.1
- బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి తమ టెంట్లను తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఎండలో అయినా నిలబడి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనకు స్థానికంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేస్తూ, తమ టెంట్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు కోరారు. శాంతియుతంగా సమ్మె నిర్వహించుకునే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ప్రభావంతో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.1
- ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోనీ మదీన కాలని లో ఓ ఇంటి వెనుకాల అనుకుని ఉన్న ఖాళీగా ఉన్న స్థలంలో మగ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడం కలకలం రేపింది.స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో నవజాత శిశువును పోలీసులు ఆస్పత్రికి తరలించి వైధ్యo అందిస్తున్నారు కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010. పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. సహకార సంఘాల పాత్రపై సూచనలు సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. మెదక్ జిల్లా సాగు అంచనాలు మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.1