logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రెండవ రోజు ఆర్టీసీ సమ్మె ఉధృతి.. బాన్సువాడలో టెంట్లు తొలగింపుపై కార్మికుల ఆవేదన, ఎండలోనే నిరసన కొనసాగింపు బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి తమ టెంట్లను తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఎండలో అయినా నిలబడి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనకు స్థానికంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేస్తూ, తమ టెంట్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు కోరారు. శాంతియుతంగా సమ్మె నిర్వహించుకునే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ప్రభావంతో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.

10 hrs ago
user_SUDHAM VITTAL
SUDHAM VITTAL
Banswada, Kamareddy•
10 hrs ago

రెండవ రోజు ఆర్టీసీ సమ్మె ఉధృతి.. బాన్సువాడలో టెంట్లు తొలగింపుపై కార్మికుల ఆవేదన, ఎండలోనే నిరసన కొనసాగింపు బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి తమ టెంట్లను తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఎండలో అయినా నిలబడి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనకు స్థానికంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేస్తూ, తమ టెంట్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు కోరారు. శాంతియుతంగా సమ్మె నిర్వహించుకునే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ప్రభావంతో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.

More news from Telangana and nearby areas
  • ​రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ​రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ​తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. ​వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం ​ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ​సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. ​దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010. పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. ​సహకార సంఘాల పాత్రపై సూచనలు ​సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. ​మెదక్ జిల్లా సాగు అంచనాలు ​మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ​ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    ​రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
​రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు.
గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. 
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ​తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు.  దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు.
​వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం
​ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
​సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638.
​దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010.
పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. 
పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.
​సహకార సంఘాల పాత్రపై సూచనలు
​సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు.
​మెదక్ జిల్లా సాగు అంచనాలు
​మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. 
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు
​ఈ సమావేశంలో  జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    5 hrs ago
  • కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ గారిపై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ - తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హరీష్ రావు. పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్, రాజా పూర్ణనందం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి. మీ కేనాల్స్, పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం,దయాకర్,రవి,సుంకరి రాములు,మోహన్ దాస్ ,అశోక్, పాల్గొన్నారు.
    1
    కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం 
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ గారిపై అసత్య ఆరోపణలు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ - తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది.
కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా?
రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హరీష్ రావు. పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్, రాజా పూర్ణనందం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు.
గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి. మీ కేనాల్స్, పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు.
ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు.
కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు.
ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్  నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం,దయాకర్,రవి,సుంకరి రాములు,మోహన్ దాస్ ,అశోక్, పాల్గొన్నారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    2 hrs ago
  • సంగారెడ్డి, మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    సంగారెడ్డి, మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    1
    కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రచురణార్థం మెదక్ 23 ఏప్రిల్ 2026 భగీరథ మహర్షి త్యాగం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. **ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *భగీరథ మహర్షి జయంతి* వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్* హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సగర వంశీయులైన భగీరథ మహర్షి గంగా నదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి అని కొనియాడారు. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గంగానదిని భూమికి తెచ్చిన మహనీయుడిగా భగీరథుని చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అందుకే గొప్ప ప్రయత్నాలను ‘భగీరథ ప్రయత్నం’గా పిలుస్తారని వివరించారు. అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి, డిపిఓ యాదయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో యూనస్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గంగా కిషన్, సంఘ నాయకులు జిల్లా అధ్యక్షుడు సాయిలు ఉప్పల సాగర సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    1
    ప్రచురణార్థం 
మెదక్ 23 ఏప్రిల్ 2026
భగీరథ మహర్షి త్యాగం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
**ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు*
*జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *భగీరథ మహర్షి జయంతి* వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి *అదనపు కలెక్టర్ నగేష్  తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్* హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సగర వంశీయులైన భగీరథ మహర్షి గంగా నదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి అని కొనియాడారు. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గంగానదిని భూమికి తెచ్చిన మహనీయుడిగా భగీరథుని చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అందుకే గొప్ప ప్రయత్నాలను ‘భగీరథ ప్రయత్నం’గా పిలుస్తారని వివరించారు.
అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో  డీఎఫ్ఓ జోజి, డిపిఓ యాదయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో యూనస్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గంగా కిషన్, సంఘ నాయకులు జిల్లా అధ్యక్షుడు సాయిలు  ఉప్పల సాగర సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    5 hrs ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.