విద్యార్థుల భవిష్యత్తుకోసం జీవితాన్ని అంకితం బాలమ్మ మృతి కుటుంబానికి గిరిజన ఉద్యోగస్తుల ఆర్థిక సాయం అచ్చంపేట, జనవరి 08 (షురూ న్యూస్ ఆప్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన బాలమ్మ గురు వారం రోజు మృతి చెందింది.మృతి పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భర్త బాలయ్యతో కలిసి ఎలాంటి వేతనం పై ఆశ లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం సేవలందించిన బాలమ్మ ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా పాఠశాల గదులు, ప్రార్థనా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో దంపతులు పూర్తి బాధ్యత వహించారు. బుధవారం బాలమ్మ మృతి చెందడంతో, ఈ విషయాన్ని తెలుసుకున్న చిట్లంకుంట గ్రామ గిరిజన ఉద్యోగస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం చేయని సాధారణ వ్యక్తులైనప్పటికీ, చదువుతున్న పిల్లల కోసం బాలమ్మ–బాలయ్య దంపతులు చూపిన త్యాగం, సేవలు ప్రశంసనీయమని తెలిపారు. జీవితాంతం గ్రామ పాఠశాల సేవకే అంకితమై, చివరి శ్వాస వరకు సేవా గుణాన్ని మరిచిపోలేదని గుర్తు చేశారు. ఈ విషాదకర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గిరిజన ఉద్యోగస్తులు వెంటనే స్పందించి బాలమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతు నాయక్, పాండు నాయక్, సూర్య నాయక్, మునిలాల్ నాయక్, భీమ్లా నాయక్, భీముడు నాయక్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకోసం జీవితాన్ని అంకితం బాలమ్మ మృతి కుటుంబానికి గిరిజన ఉద్యోగస్తుల ఆర్థిక సాయం అచ్చంపేట, జనవరి 08 (షురూ న్యూస్ ఆప్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన బాలమ్మ గురు వారం రోజు మృతి చెందింది.మృతి పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భర్త బాలయ్యతో కలిసి ఎలాంటి వేతనం పై ఆశ లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం సేవలందించిన బాలమ్మ ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా పాఠశాల గదులు, ప్రార్థనా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో దంపతులు పూర్తి బాధ్యత
వహించారు. బుధవారం బాలమ్మ మృతి చెందడంతో, ఈ విషయాన్ని తెలుసుకున్న చిట్లంకుంట గ్రామ గిరిజన ఉద్యోగస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం చేయని సాధారణ వ్యక్తులైనప్పటికీ, చదువుతున్న పిల్లల కోసం బాలమ్మ–బాలయ్య దంపతులు చూపిన త్యాగం, సేవలు ప్రశంసనీయమని తెలిపారు. జీవితాంతం గ్రామ పాఠశాల సేవకే అంకితమై, చివరి శ్వాస వరకు సేవా గుణాన్ని మరిచిపోలేదని గుర్తు చేశారు. ఈ విషాదకర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గిరిజన ఉద్యోగస్తులు వెంటనే స్పందించి బాలమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతు నాయక్, పాండు నాయక్, సూర్య నాయక్, మునిలాల్ నాయక్, భీమ్లా నాయక్, భీముడు నాయక్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- *ఎన్నికలలో హామీలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన అక్రమ కేసుల?* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థి విజన సంఘాల నాయకుల పైన రౌడీషీట!?* *రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న నారా లోకేష్* *విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ ను ఎత్తివేయాలి* *రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం* *ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైయస్సార్ విద్యార్థి విభాగం* *రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ ప్రెస్ క్లబ్ నందు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్ర, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు బాబు, వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తూ జైలుకు పంపడాన్ని ఖండించారు.. ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అడగడం లేదు ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు యువజనలకు వాటిని అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి దొంగ కేసులను బయటికి తోడి విద్యార్థి యువజన సంఘాల నాయకులను జైలుకు పంపుతూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులను కేసుల ద్వారానో జైల్లోకు పంపడం ద్వారానో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారానో విద్యార్థి యువజన ఉద్యమాలను అనిచివేయాలని చూస్తూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పులు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెడతారా అని మన ప్రభుత్వం వస్తే మీకు విద్యార్థులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి నేరుగా తీసుకురండి మేము కేసులు పెట్టడం అరెస్టు చేయడం గృహనిర్బంధాలు చేయడం ఇలాంటివి మా ప్రభుత్వంలో ఉండదని చెప్పిన నారా లోకేష్ ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఎలా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వేయాలని విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు తేజ అరుణ్ నాగరాజు మహేష్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1
- 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు2
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- భారత్ మాత కి జై 🇮🇳1
- పిల్లల భవిష్యత్తు కోసం తాను ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడి పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ విద్యార్థులకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయనతోపాటు ఆర్డీవో అశోక్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.1