Shuru
Apke Nagar Ki App…
#JaiDeshParty * #ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026–27 ఆర్థిక లోటుల మధ్య కూడా ఆస్తి సృష్టి, ఉపాధి, సేవల నాణ్యతపై దృష్టి సమతుల్యత కనిపించినా, ఆరోగ్యం మరియు సహకార రంగాల్లో మరింత బలమైన కేటాయింపులు, స్పష్టమైన అమలు అవసరం. #Andhra #APBUDGET #APAssembly #Ncbn #PawanKalyan #ysjagan
JaiDesh Party
#JaiDeshParty * #ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026–27 ఆర్థిక లోటుల మధ్య కూడా ఆస్తి సృష్టి, ఉపాధి, సేవల నాణ్యతపై దృష్టి సమతుల్యత కనిపించినా, ఆరోగ్యం మరియు సహకార రంగాల్లో మరింత బలమైన కేటాయింపులు, స్పష్టమైన అమలు అవసరం. #Andhra #APBUDGET #APAssembly #Ncbn #PawanKalyan #ysjagan
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- *కొండపల్లి అరుణ నగర్ లో నిరసన* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* కొండపల్లిలోని అరుణ నగర్ కాలనీ వాసులు క్వారీ, క్రషర్ లారీల రాకపోకల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.లారీల వల్ల వెలువడే దుమ్ము, ధూళి కారణంగా నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అధికారులు వెంటనే స్పందించి కాలనీలోకి లారీల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.1