నిర్మల్ జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ప్రకటించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకునేవారు డిఎస్పీ లేదా ఆపై అధికారులను సంప్రదించి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. దురుద్దేశ్యంతో నేరాలకు పాల్పడేందుకు నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వంటి ఎటువంటి ఆయుధాలు లేదా సామగ్రిని కలిగి ఉండరాదని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులవుతారని ఆమె హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
నిర్మల్ జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ప్రకటించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకునేవారు డిఎస్పీ లేదా ఆపై అధికారులను సంప్రదించి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. దురుద్దేశ్యంతో నేరాలకు పాల్పడేందుకు నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వంటి ఎటువంటి ఆయుధాలు లేదా సామగ్రిని కలిగి ఉండరాదని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులవుతారని ఆమె హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
- బాసర రైల్వేస్టేషన్ వద్దనున్న శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయినప్పటి నుండి వీధి దీపాలు వెలగడం లేదని, ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ఈ ఫ్లై ఓవర్ పై అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు సంభవించాయని వారు పేర్కొంటున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా హైవే రోడ్డు అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు తక్షణమే స్పందించి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా స్పీడ్ బ్రేకర్‌లను కూడా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.1
- భీంపూర్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల జొన్న పంటలు తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వర్షాల కారణంగా తడిసిపోయిన జొన్నలను పరిశీలించారు. రైతులు పడుతున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన వారితో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేశారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన జొన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్ అవ్వక, అకాల వర్షాలకు తడిసిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పంటకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే, తడిసిన జొన్నలను కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు జిసీసీ మేనేజర్ ఇస్తారి, ఏవో శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుధాకర్, సీనియర్ నాయకులు కెమ శ్రీకాంత్, మండల కన్వీనర్ నాగయ్య, స్థానిక సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ లింబాజి, కల్చప్, ప్రవీణ్, గోవర్ధన్, కపిల్, రాథోడ్ ఉత్తమ్, దినేష్, అనిల్, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు.2
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కీలక ఘట్టానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మే 31వ తేదీ మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి సాయంత్రం కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. రైలు ప్రయాణం సందర్భంగా మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ముచ్చటించడమే కాకుండా, రైలులోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన మరికాసేపట్లో సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, హెలిపాడ్, వేదిక ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం, సొంతింటి భరోసా కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ పథకానికి కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనుండటంతో, ఇది ప్రభుత్వ గృహ విప్లవంలో మరో చారిత్రక ఘట్టంగా నిలవనుంది.3
- కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని లింగాపూర్‌లో బండారి రాజరెడ్డి (56) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా అదృశ్యమైన ఆయన మృతదేహం శనివారం రాత్రి పాడుబడ్డ బావిలో లభ్యమైంది. రాజిరెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతకగా, ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆయన ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ద్విచక్రవాహనాన్ని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా, రాజిరెడ్డిని మంచాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్‌లు కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టినట్లు వారు అంగీకరించారు. రాజిరెడ్డి-ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నిందితులు పూడ్చిపెట్టిన రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ సంఘటనా స్థలంలో ఉండి విచారణను పర్యవేక్షించారు.1
- ఆదివారం సాయంత్రం నార్నూర్ మండలంలోని భీంపూర్, కొత్తపల్లి, మల్కుగూడ, తాడిహత్నూర్, గంగాపూర్, మాన్కపూర్ సహా పలు గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా, పలు ప్రధాన రోడ్లు వర్షపునీటితో పూర్తిగా జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.1
- జన్నారం మండలంలోని భంగ్యా నాయక్ తండా గ్రామ ప్రజలు తమ గ్రామంలో వీధి దీపాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు కాలనీలలో విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ, వీధి దీపాలు లేవని, దీంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడకతప్పడం లేదని వారు వాపోయారు. ముఖ్యంగా, అత్యవసర సమయాలలో బయటకు రావాలంటే భయంగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీలలో వీధి దీపాలను ఏర్పాటు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.1
- నెరడిగొండ మండలానికి చెందిన జొన్న రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారీ సంఖ్యలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత తీవ్రంగా ఉందని, దీనిని అదనుగా తీసుకుని లారీ డ్రైవర్లు ధాన్యం రవాణా కోసం తమ నుండి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు తమ ఆవేదనను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. "సారు.. మమ్మల్ని మీరే కాపాడాలి" అంటూ రైతులు ఎమ్మెల్యేను వేడుకున్నారు. రైతుల సమస్యలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే స్పందించారు. అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, జొన్నల రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు వెంటనే అదనపు లారీలను ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా, లారీ డ్రైవర్లు రైతుల నుండి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.1
- నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మంజీరా నదిలో గొర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్లిన బావా బామ్మర్దులు ఇద్దరూ నీట మునిగి మరణించారు. ఈ ఘటనలో, కుర్మ గంగోండ అనే వ్యక్తి ముందుగా నదిలోకి దిగి ఊబిలో చిక్కుకుపోయి మునిగిపోయారు. అతన్ని కాపాడేందుకు ఆయన బావ గంగారం కూడా నీటిలోకి దిగగా, అతను కూడా నీటిలో మునిగిపోయారు. ప్రస్తుతం కుర్మ గంగోండ మృతదేహం లభ్యం కాగా, గంగారం మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.1