పి.యు.సి కమిటీ సమావేశంలో పలు ప్రభుత్వ సంస్థలపై సమీక్ష. పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే, పి.యు.సి కమిటీ సభ్యులు వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, అమరావతి, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పి.యు.సి) సమావేశం కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి అధ్యక్షతన గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు, మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు కీలక సంస్థలు, వాటి కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంస్థల పనితీరు తదితర అంశాలపై కమిటీ సభ్యులు సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ సంస్థలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా, ప్రజలకు అందాల్సిన సేవలు సమర్థవంతంగా అందుతున్నాయా అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యారంగ అభివృద్ధి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, అమలవుతున్న కార్యక్రమాలపై చర్చ జరిగింది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చేపడుతున్న చర్యలను కమిటీ పరిశీలించింది. అలాగే ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పరిధిలో పట్టణ మౌలిక వసతుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ, వాటి సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఏపీ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO) ద్వారా చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, సహకార సంఘాల బలోపేతం, చేనేత రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై కూడా సమీక్ష జరిగింది. ఏపీ ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు (APKVIB) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన, గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధి కార్యక్రమాలు, ఖాదీ ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. అదేవిధంగా ఏపీ విద్యా మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (APEWIDC) ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, సంక్షేమ శాఖలకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ పనులు, వాటి పురోగతి, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలను సమావేశంలో పరిశీలించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని కమిటీ సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా ఆయా సంస్థల పనితీరు ఉండాలని చర్చించారు. ఈ సమావేశం ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై పి.యు.సి కమిటీ సమగ్రంగా సమీక్షించింది.

- కుష్టు రోగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కాకినాడ ఎంపీజే ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ప్రతిపదిహేను రోజులకు ఒకసారి జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ( sharp) RTC బస్టాండ్ దగ్గర వున్న హిందూస్మశానవాటిక దగ్గర వున్న లెప్రసీ కాలనీ నందు 55 మంది లెప్రసీ రోగులకు డ్రెస్సింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు MPJ సానుభూతి పరురాలైన శ్రీమతి బీబి గారు వారి భర్త గారైనా స్వర్గీయ అలీ గారి జ్ఞాపకార్ధం ₹2500/- ఆర్ధిక సహాయం చేస్తున్నారు. డ్రెస్సింగ్ తో పాటు 39 మంది స్త్రీలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్ లు, చికెన్ బిర్యాని తోపాటు పరిశుభ్రతకు అవసరమయ్యే వస్తువుల (surf ప్యాకెట్ లు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, కొబ్బరి నూనె, షాంపూ ప్యాకెట్, soap) కిట్ కూడా లెప్రసి రోగులకు ప్రదానము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు Md హలీం గారు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం లో జనరల్ సెక్రటరీ Md ఉస్మాన్ షబ్బీర్ గారు, షాకీర్ గారు, దౌలానా బాషా గారు, Md ఇబ్రహీం గారు, కలీం గారు, Md రహ్మతుల్లా గారు పాల్గొన్నారు.1
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1
- *నేపాల్‌లో వరద బీభత్సం..* *వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..* : నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.. ఆ వీడియోలో.. పర్యాటకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వరద నీరు వారి వైపు దూసుకువచ్చింది.. దీంతో భయపడిపోయిన పర్యాటకులు కొండ మీదకు పరుగులు తీయటం మొదలెట్టారు. అయితే, కొంతమంది పర్యాటకులు వరద నుంచి తప్పించుకోలేకపోయారు.. వరద నీరు వారిని ముంచెత్తింది. పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయారు.. కొంతమంది కొండ మీదకు సగం ఎక్కి ఆగిపోయారు.. వరద నీరు తమ వరకు రాదని వారు భావించారు.. ఊహించని విధంగా వరద నీటిలో వారు కూడా కొట్టుకుపోయారు.. కొండపై వరకు ఎక్కిన వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2 నిమిషాల 7 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. గల్లంతయిన వారు ప్రాణాలతో ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నా’..‘ అయ్యో పాపం. నేపాల్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు......1