Shuru
Apke Nagar Ki App…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం
Satheesh gangu
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం
More news from తెలంగాణ and nearby areas
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం1
- *మున్సిపోల్ ఎన్నికల పై జనసేన నజర్...పవర్ స్టార్ అభిమానుల్లో నయా జోష్* తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలపై జనసేన నజర్ వేసిందా?....సంస్థాగతంగా బలపడేందుకు సిద్దమయ్యిందా?...అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల హడావిడి చూస్తే ఔననే సమాధానం వస్తుంది. ఇటీవల కొండగట్టు ఆంజనేయస్వామిని ఏపి డిప్యూటి సీఎం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దర్శించుకుని పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో జనసేనలో నయా జోష్ కనిపిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సన్నహాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ గా సాగర్ అలియాస్ ఆర్.కె.నాయుడును నియమించి మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అయ్యే పనిలో నిమగ్నమయ్యారు. కొండగట్టు అంజన్న సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలను ముమ్మరం చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన కమిటీలను రద్దు చేశారు. వాటి స్థానంలో అడహక్ కమిటీలను నియమించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త కమిటీల నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.1
- హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో లబ్ధిదారులకు మంజూరైనటువంటి వ్యవసాయ పనిముట్లను చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిందని అలాగే రైతుబంధు వెయ్యి రూపాయలు అదనంగా మరియు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు2
- బాన్సువాడ: విద్యార్థిని మృతి దురదృష్టకరం: పోచారం బొర్లం గురుకుల పాఠశాల ఆటో ప్రమాదంలో విద్యార్థిని సంగీత మృతి చెందడం పట్ల MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశామని, పోలీసు విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.1
- జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు -జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ -పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా] నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్‌ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, NCC పరేడ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, కలెక్టరేట్ ఏ.వో షాదబ్ హకిమ్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, సమబంధిత కార్యాలయాల సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ....భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తుందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం గురించి క్షుణ్ణంగా వివరించారు. జిల్లాలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పౌరసేవలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర విభాగాల్లో సాధించిన పురోగతి పై ఆయన విభాగాల వారీగా ఉపన్యాసించారు. వ్యవసాయ రంగంలో రైతులకు మద్దతు ధరలు, పంట బీమా, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సేవా కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్–రబీ సీజన్లలో పంటల విస్తీర్ణం పెరిగినట్టు వివరించారు. మార్కెట్ యార్డుల్లో MSP చెల్లింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో జిల్లాలో PHC, CHC, మాతృశిశు ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు సమర్థవంతంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల పెంపు, డిజిటల్ బోధన, లైబ్రరీలు మరియు లాబ్‌ల ఏర్పాటుతో విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మెరుగుపడినట్టు వివరించారు. బాలికల విద్య ప్రోత్సహానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, CC రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, త్రాగునీటి సరఫరా వంటి పౌరసేవలు అమలు అవుతున్నాయని తెలియజేశారు. పట్టణాభివృద్ధిలో రోడ్లు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ట్యాంకుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు అమలు అవుతున్నాయని వివరించారు.4
- సూర్య ధన్వంతరి దేవాలయంలో వైభవంగా ఆరోగ్య హోమము.. జగిత్యాల పట్టణంలోని శ్రీ సూర్యధర్మంతరి దేవాలయంలో సోమవారం స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రథసప్తమి, సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ ఉదయం 10 గంటలకు. ఆరోగ్య హోమ కార్యక్రమంలో భక్తులు పాల్గొని హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే. సూర్య భగవానుని మాల తీసుకున్న భక్తులు స్వామి అమ్మవాలను దర్శించుకొని అనంతరం దీక్షా మాల విరమణ చేశారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమములో ఫౌండర్ &ఛైర్మెన్ డాక్టర్ వడ్ల గట్ట రాజన్న, మేనేజంగ్ ట్రస్ట్ గట్టు రాజేందర్, ప్రెసిడెంట్ ముత్యాల రామలింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వోడ్నాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్షి వడ్ల గట్ట శంకర్, తిరుపతి, రాజశేఖర్, గంగాధర్, మల్లేశం- లలిత అర్చకులు ప్రణయ్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.1
- *రామంచ స్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.... క్రీడా పోటీలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు ప్రధానం చేసిన సర్పంచ్ కిషన్ రెడ్డి* గణతంత్ర దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. హైస్కూల్లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ప్రధానోపాధ్యాయులు ఆవిష్కరించగా ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి ఉప సర్పంచ్ గీట్ల తిరుపతి రెడ్డి తో పాటు పలువురు వార్డు సభ్యులు హాజరై జెండా వందనం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ కిషన్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు. పోటీలు నిర్వహించిన టీచర్లను అభినందించి విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు. స్కూల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్నామని స్కూల్ టీచర్లు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ ని స్కూల్ టీచర్లు శాలువాలతో సన్మానించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకర్షించాయి.4