logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గోదావరి ముంపు ప్రాంత ప్రజలందరి సురక్షిత ప్రాంతాల తరలించాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోడె బోయిన రవి పటేల్ డిమాండ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గట్ల రాజన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోడె బోయిన రవి పటేల్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో బూర్గంపాడు మండలంలో ప్రధాన రహదారులపై పలుచోట వరద నీరు చేరుతున్న పరిస్థితి, గోదావరి వరద గంట గంటకు పెరుగుతున్న సందర్భంగా బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి ముంపు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పటికీ సురక్షిత ప్రాంతాల తరలించాలని అధికారులను కోరారు

1 day ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 day ago
8233ffde-1d5b-4a35-9812-c8dc0940e8b7

గోదావరి ముంపు ప్రాంత ప్రజలందరి సురక్షిత ప్రాంతాల తరలించాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోడె బోయిన రవి పటేల్ డిమాండ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గట్ల రాజన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోడె బోయిన రవి పటేల్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో బూర్గంపాడు మండలంలో ప్రధాన రహదారులపై పలుచోట వరద నీరు చేరుతున్న పరిస్థితి, గోదావరి వరద గంట గంటకు పెరుగుతున్న సందర్భంగా బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి ముంపు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పటికీ సురక్షిత ప్రాంతాల తరలించాలని అధికారులను కోరారు

More news from తెలంగాణ and nearby areas
  • బిహారీలకు ఏదైనా సాధ్యమే….🐊* ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు! బిహార్లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై వేసుకొని వెళ్తున్న వీడియో వైరలవుతోంది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో అతడే దాన్ని తాళ్లతో బంధించి మోసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తర్వాత అటవీ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని నదిలో వదిలేశారు. బిహారీలకు ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
    1
    బిహారీలకు ఏదైనా సాధ్యమే….🐊*

ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు! 
బిహార్లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై వేసుకొని వెళ్తున్న వీడియో వైరలవుతోంది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో అతడే దాన్ని తాళ్లతో బంధించి మోసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తర్వాత అటవీ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని నదిలో వదిలేశారు. బిహారీలకు ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    1
    భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం......
భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు.
స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి.
అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Shivaram
    Shivaram
    Local News Reporter భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    23 hrs ago
  • July in frames ✨ Farmers. Students. Youth. Women. From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.
    1
    July in frames ✨ 
Farmers. Students. Youth. Women. 
From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
    1
    వైరా  ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా లో ఘనంగా బోనాల జాతర 
ఖమ్మం జిల్లా వైరా  ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.
    1
    రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న 
ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు.
ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • విద్యార్ధుల రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు.... హైదరాబాద్‌లోని చంపాపేట్ ఉన్న Aira Junior College విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. స్థానికులు Dial 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    విద్యార్ధుల రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు....
హైదరాబాద్‌లోని చంపాపేట్ ఉన్న Aira Junior College విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. స్థానికులు Dial 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.