Shuru
Apke Nagar Ki App…
దిగ్భ్రాంతికి గురిచేసిన బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి వరంగక్ లోకల్ న్యూస్,జులై 31,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (51) గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ నెల 26న ఛాతినొప్పితో అస్వస్థతకు గురై కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆయన చికిత్స పొందుతూ వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
QHIRUDDIN MD
దిగ్భ్రాంతికి గురిచేసిన బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి వరంగక్ లోకల్ న్యూస్,జులై 31,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (51) గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ నెల 26న ఛాతినొప్పితో అస్వస్థతకు గురై కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆయన చికిత్స పొందుతూ వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.2
- బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.1
- జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.4
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- ఉద్యమ గాయాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానన్న పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్:నర్సంపేట పట్టణంలో 2023లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడటంతో కుడి కన్ను చూపు కోల్పోయానని, లాఠీచార్జీల్లో చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం శరీర నొప్పులతో బాధపడుతూ వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటేనే నడవగలుగుతున్నానని పేర్కొంటూ, తనను అపార్థం చేసుకోవద్దని ప్రజలను కోరారు.1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఫోటోగ్రాఫర్ ఇంట్లో అగ్నిప్రమాదం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ చెన్నంరాజు నివాసంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించడంతో పేలుడు చోటుచేసుకుని ఇంట్లోని గృహోపకరణాలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.1