Shuru
Apke Nagar Ki App…
పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు : ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 150 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 16, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధమని తెలిపారు. అలాగే కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Chetty:Ramesh
పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు : ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 150 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 16, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధమని తెలిపారు. అలాగే కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కోన లక్ష్మి(72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ లో నివాసం ఉండే లక్ష్మీ గొంతులో కత్తి ఘాట్లు ఉండడంతో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. గతంలో వృధ్ధురాలిపై దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చి చూసేసరికి, రక్తం మడుగులో పడిఉన్న తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహం ఏరియా ఆసుపత్రికి తరలించారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1