కరీంనగర్ లో వరకట్న దాహానికి మహిళ బలి....ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం అత్తింటివారు వేదింపులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29) కరీంనగర్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు అత్తింటివారి వరకట్నం వేధింపులే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. మమత కు తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ ప్రేమించి 14 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉంటూ సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వారు గోదావరిఖనిలోని గంగానగర్ అద్దె ఇంటిలోకి మారారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకు మమత భర్త నరేష్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం వేదింపులకు గురి చేయడంతో రెండు నెలల క్రితం మమత సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చి పంపించారు. ఈనెల 16న మమత సోదరుడు మహేష్ కు ఫోన్ చేసి తనను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, చంపేసే ప్రమాదం ఉందని చెప్పడంతో తాను దూరంగా ఉన్నానని మరునాడు ఉదయం వస్తానని వివరించాడు. దీంతో తన చిన్నాన్న కొడుకు అయిన లింగంపల్లి శంకర్ కు కాల్ చేసి చెప్పగా ఆటోలో వెళ్లి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తీసుకెళ్లాడు. మరునాటి ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్ ఇంటి యజమాని ఫోన్ చేసి నరేష్ మెట్ల వద్ద పడి ఉన్నాడని మమతకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెళ్లిన మమత అత్తింటి వారికి భర్త నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని చెప్పగా కరీంనగర్ లోని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మమత చికిత్స చేయిస్తోంది. మెడికోవర్ ఆసుపత్రికి మమత సోదరుడు మహేష్ కూడా చేరుకోగా అక్కడే ఉన్న మమత అత్తింటి వారు ఆమెను మానసికంగా వేదింపులకు గురి చేశారు. నీ కారణంగానే తమ కొడుకు పరిస్థితి ఇలా తయారైందంటూ సూటి పోటీ మాటలు అనడంతో తట్టుకోలేకపోయిన మమత వాష్ రూంకని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాత మహేష్ మమతకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందాడు. గంటల సమయంలో మమత సోదరుడు మహేష్ కు కాల్ చేసి అత్తింటి వారి వేదింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెప్తుండగానే ఆమె అరుపులు వినిపించాయి. వెంటనే మహేష్ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు మమత లొకేషన్ ట్రేస్ చేశారు. ఆమె తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులతో పాటు మహేష్ ఘటనా స్థలానికి చేరుకోగా మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనపోయింది. మృతదేహాన్ని కరీనంగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ లు పరిశీలించారు. మమత తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్ తో పాటు అత్తింటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
కరీంనగర్ లో వరకట్న దాహానికి మహిళ బలి....ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం అత్తింటివారు వేదింపులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29) కరీంనగర్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు అత్తింటివారి వరకట్నం వేధింపులే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. మమత కు తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ ప్రేమించి 14 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉంటూ సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వారు గోదావరిఖనిలోని గంగానగర్ అద్దె ఇంటిలోకి మారారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకు మమత భర్త నరేష్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం వేదింపులకు గురి చేయడంతో రెండు నెలల క్రితం మమత సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చి పంపించారు. ఈనెల 16న మమత సోదరుడు మహేష్ కు ఫోన్ చేసి తనను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, చంపేసే ప్రమాదం ఉందని చెప్పడంతో తాను దూరంగా ఉన్నానని మరునాడు ఉదయం వస్తానని వివరించాడు. దీంతో తన చిన్నాన్న కొడుకు అయిన లింగంపల్లి శంకర్ కు కాల్ చేసి చెప్పగా ఆటోలో వెళ్లి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తీసుకెళ్లాడు. మరునాటి ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్ ఇంటి యజమాని ఫోన్ చేసి నరేష్ మెట్ల వద్ద పడి ఉన్నాడని మమతకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెళ్లిన మమత అత్తింటి వారికి భర్త నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం
ఇచ్చి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని చెప్పగా కరీంనగర్ లోని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మమత చికిత్స చేయిస్తోంది. మెడికోవర్ ఆసుపత్రికి మమత సోదరుడు మహేష్ కూడా చేరుకోగా అక్కడే ఉన్న మమత అత్తింటి వారు ఆమెను మానసికంగా వేదింపులకు గురి చేశారు. నీ కారణంగానే తమ కొడుకు పరిస్థితి ఇలా తయారైందంటూ సూటి పోటీ మాటలు అనడంతో తట్టుకోలేకపోయిన మమత వాష్ రూంకని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాత మహేష్ మమతకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందాడు. గంటల సమయంలో మమత సోదరుడు మహేష్ కు కాల్ చేసి అత్తింటి వారి వేదింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెప్తుండగానే ఆమె అరుపులు వినిపించాయి. వెంటనే మహేష్ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు మమత లొకేషన్ ట్రేస్ చేశారు. ఆమె తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులతో పాటు మహేష్ ఘటనా స్థలానికి చేరుకోగా మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనపోయింది. మృతదేహాన్ని కరీనంగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ లు పరిశీలించారు. మమత తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్ తో పాటు అత్తింటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- మగ్గిడి మహేందర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు గ్రేటర్ వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మగ్గిడి మహేందర్ అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారి కేఆర్ నాగరాజు అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మార్గం ప్రసాద్ ఇటీవల మరణించగా నేడు వారి నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు... ఎమ్మెల్యే గారి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...7
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి–కాలేశ్వరం ప్రధాన రహదారి కమలాపూర్ క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడం తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భూపాలపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్ మరియు గణపురం గ్రామానికి చెందిన రెబ్బ శ్రీకాంత్. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.1
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్‌కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు. గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- శివరాత్రి రోజున జగిత్యాలలో యువకుడి హత్య కేసును పోలీసులు చేదించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. జగిత్యాలలో డిఎస్పి రఘు చందర్ సమక్షంలో అరెస్ట్ అయిన ఇద్దరిని చూపించి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల మండలం పోరండ్లకు చెందిన విశ్వనాధ్ పెళ్ళైన అంతర్గాం కు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ కు భర్త ఇద్దరు పిల్లలు ఉండగా వారిని వదిలేసిన విశ్వనాథ్ తో సహజీవనం చేస్తుంది. దీంతో పిల్లలను వదిలేసి పరాయి మగాడి తో ఉంటున్న భార్యపై కక్షగట్టిన భర్త గంగాధర ఇద్దరిని లేపేయాలని పథకం పన్నాడు. అతని బావమరిది బోదసు తిరుపతితో కలిసి మహాశివరాత్రి గుడికి వెళ్తున్న విశ్వనాథ్ పై దాడి చేసి హత్య చేశారు. తృటిలో మహిళ తప్పించుకుని ప్రాణాలతో బయటపడిందని డిఎస్పీ తెలిపారు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు మహిళ మొదటి భర్త గంగాధర్, సొదరుడు తిరుపతిని అరెస్టు చేసి జైలుకు పంపామని డిఎస్పీ రఘుచందర్ తెలిపారు.4
- రైల్ కిందపడి యువకుడు ఆత్మహత్య మంగళవారం అర్ధరాత్రి 11:30 గంటల సమయమ లో గుర్తు తెలియని పురుషుడు (25) చింతలపల్లి ఎలుగూరు రైల్వే స్టేషన్ ల మధ్య డౌన్ లైన్ పై వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బండి కింద పడి ఆత్మహత్య. మృతుడి కుడి పక్క చాతి పై పుట్టుమచ్చ,ఎడమ చేతి పై ఆనంద్ అనే పేరు పచ్చబొట్టు ఉన్నది. మృతదేహం వరంగల్ MGM మార్చురీ కి తరలింపు. వరంగల్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు.6
- జనగాం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్ మంజులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారి కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.1