Shuru
Apke Nagar Ki App…
పరవాడ పోలీస్ స్టేషన్‌పై వరుస ఫిర్యాదులు.. సీఐపై చర్యలు కోరుతున్న బాధితుడు అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్ పనితీరుపై ఓ బాధితుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వ భూమి ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తన ఫిర్యాదులపై స్పందించకుండా, తనపైనే బైండోవర్ కేసు నమోదు చేసి రూ.2 లక్షల పూచీకత్తు విధించారని ఆరోపించారు. సీఐ లంక భాస్కర్ రావుపై డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, డీజీపీ, హోంశాఖకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు, రౌడీషీట్ల బెదిరింపులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆరోపణలపై అధికారిక విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది.
Rc Tv Telugu

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అరకు: ధింసా నృత్యంతో రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న విద్యార్ధినులు విద్యార్ధినిల ధింసా ప్రాక్టీస్ లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వేదిక కలకలలాడుతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగష్ట్ 1న భోగాపురం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడి కి ధింసా నృత్యంతో స్వాగతం పలకడానికి 14 వేల మంది విద్యార్ధినిలు సిద్దమవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్ధినిల వృత్తాకార కదలికలు, లయబద్ధ అడుగులు, సాంప్రదాయ వాయిద్యా శబ్దాలతో వేదిక ప్రాంతం అలరారుతోంది.1
- లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.3
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.1