Shuru
Apke Nagar Ki App…
నాడు నేడు రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాట పడుతుందని గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చుట్టంలాంటి భూభారతి చట్టం తెచ్చి వారికి మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.
Mogulagani Mahendar Mogulagani Mahendar
నాడు నేడు రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాట పడుతుందని గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చుట్టంలాంటి భూభారతి చట్టం తెచ్చి వారికి మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.
More news from తెలంగాణ and nearby areas
- కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.1
- *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...** 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..2
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- *మున్సిపోల్ ఎన్నికల పై జనసేన నజర్...పవర్ స్టార్ అభిమానుల్లో నయా జోష్* తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలపై జనసేన నజర్ వేసిందా?....సంస్థాగతంగా బలపడేందుకు సిద్దమయ్యిందా?...అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల హడావిడి చూస్తే ఔననే సమాధానం వస్తుంది. ఇటీవల కొండగట్టు ఆంజనేయస్వామిని ఏపి డిప్యూటి సీఎం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దర్శించుకుని పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో జనసేనలో నయా జోష్ కనిపిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సన్నహాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ గా సాగర్ అలియాస్ ఆర్.కె.నాయుడును నియమించి మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అయ్యే పనిలో నిమగ్నమయ్యారు. కొండగట్టు అంజన్న సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలను ముమ్మరం చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన కమిటీలను రద్దు చేశారు. వాటి స్థానంలో అడహక్ కమిటీలను నియమించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త కమిటీల నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.1
- హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో లబ్ధిదారులకు మంజూరైనటువంటి వ్యవసాయ పనిముట్లను చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిందని అలాగే రైతుబంధు వెయ్యి రూపాయలు అదనంగా మరియు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు2
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం1
- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కేయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంటనే విబిజి రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.1