Shuru
Apke Nagar Ki App…
రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన బోథ్ MLA అనిల్ జాదవ్.... ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన చిన్నారులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Mallaiah Potta
రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన బోథ్ MLA అనిల్ జాదవ్.... ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన చిన్నారులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- సెప్టెంబర్ 22, 2026 – ఆదిలాబాద్ *రిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ* *ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి పత్రికా ప్రకటన * *రిమ్స్‌ను 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం* *రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ* ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, రిమ్స్ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్ వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో రిమ్స్‌లోని నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి, ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి, చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల ఎం సి ఎచ్ భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్‌ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థుల సంఖ్య, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు పీడియాట్రిక్స్, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణలో లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రిమ్స్‌లో కింది మూడు కీలక సేఫ్టీ ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్, ఫైర్ సేఫ్టీ ఆడిట్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్ నిపుణుల కమిటీ నివేదిక, సేఫ్టీ ఆడిట్‌ల ఆధారంగా రిమ్స్‌లో అవసరమైన మరమ్మతులు, అదనపు మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులు, కొత్త భవనాల నిర్మాణం, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రి తెలిపారు. రిమ్స్‌లో మెయింటెనెన్స్, మానిటరింగ్, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తామని చెప్పారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిమ్స్‌లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, అవసరమైన మానవ వనరులను సమకూర్చడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరంద్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో తొమ్మిదవ, పదవ తరగతులకు పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న అభి ప్రైవేట్ స్కూల్ ముందు ధర్నా చేసిన విద్యార్థుల పేరెంట్స్.1
- అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి మావల: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కొందరు అధికారులు గైర్హాజరై ఇన్‌చార్జిలను పంపడంపై చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, విద్య, సంక్షేమ శాఖల అభివృద్ధి పనులపై సమీక్షించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎంపీడీఓ ముత్యంరావు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.1
- భక్తులను ఆకట్టుకున్న పార్వతి తనయ బాల గణపయ్య విగ్రహం........ నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో చిన్నారులు ప్రతిష్టించిన శ్రీ సూర్యచంద్ర బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన అనంతరం వినాయకుని శోభాయాత్ర ప్రారంభించారు. తన తల్లి పార్వతి దేవి పై బాలగణపతిలా కూర్చున్న విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విగ్రహ దాత తాడురి సాయిబాబా, కళావతి దంపతులను నిర్వాహకులు శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోశెట్టి, మాజీ కౌన్సిలర్ గండ్రత్ రమణ, కందుల హరీష్, పోగుల హరీష్, మునిగెల మనీష్, శశాంక్, మండాజీ అభిలాష్, దీపక్,సాయి, తదితరులున్నారు.1
- లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం, అంతట పండగ వాతావరణం దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొల్పిన రెండు వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామ విధుల గుండా ఊరేగింపు నిర్వహించి సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.1
- రామగుండం: మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.1
- సెప్టెంబర్ 22, 2026 – ఆదిలాబాద్ *రిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ* *ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి* పత్రికా ప్రకటన *రిమ్స్‌ను 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం* *రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ* ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, రిమ్స్ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్ వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో రిమ్స్‌లోని నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి, ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి, చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల ఎం సి ఎచ్ భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్‌ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థుల సంఖ్య, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు పీడియాట్రిక్స్, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణలో లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రిమ్స్‌లో కింది మూడు కీలక సేఫ్టీ ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్, ఫైర్ సేఫ్టీ ఆడిట్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్ నిపుణుల కమిటీ నివేదిక, సేఫ్టీ ఆడిట్‌ల ఆధారంగా రిమ్స్‌లో అవసరమైన మరమ్మతులు, అదనపు మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులు, కొత్త భవనాల నిర్మాణం, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రి తెలిపారు. రిమ్స్‌లో మెయింటెనెన్స్, మానిటరింగ్, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తామని చెప్పారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిమ్స్‌లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, అవసరమైన మానవ వనరులను సమకూర్చడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరంద్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.2
- రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. సహాయక చర్యలను పరిశీలించి, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.1