సెప్టెంబర్ 22, 2026 – ఆదిలాబాద్ *రిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ* *ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి* పత్రికా ప్రకటన *రిమ్స్‌ను 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం* *రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ* ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, రిమ్స్ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్ వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో రిమ్స్‌లోని నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి, ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి, చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల ఎం సి ఎచ్ భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్‌ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థుల సంఖ్య, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు పీడియాట్రిక్స్, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణలో లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రిమ్స్‌లో కింది మూడు కీలక సేఫ్టీ ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్, ఫైర్ సేఫ్టీ ఆడిట్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్ నిపుణుల కమిటీ నివేదిక, సేఫ్టీ ఆడిట్‌ల ఆధారంగా రిమ్స్‌లో అవసరమైన మరమ్మతులు, అదనపు మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులు, కొత్త భవనాల నిర్మాణం, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రి తెలిపారు. రిమ్స్‌లో మెయింటెనెన్స్, మానిటరింగ్, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తామని చెప్పారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిమ్స్‌లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, అవసరమైన మానవ వనరులను సమకూర్చడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరంద్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 22, 2026 – ఆదిలాబాద్ *రిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ* *ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి* పత్రికా ప్రకటన *రిమ్స్‌ను 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం* *రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ* ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, రిమ్స్ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, రిమ్స్ వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో రిమ్స్‌లోని నవజాత శిశు వార్డులో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి, ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి, చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. రిమ్స్‌లో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150
పడకల ఎం సి ఎచ్ భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్‌ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. థలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రిమ్స్‌లో పీజీ వైద్య విద్యార్థుల సంఖ్య, ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు పీడియాట్రిక్స్, గైనకాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలు, నిర్వహణలో లోపాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రిమ్స్‌లో కింది మూడు కీలక సేఫ్టీ ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్, ఫైర్ సేఫ్టీ ఆడిట్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్ నిపుణుల కమిటీ నివేదిక, సేఫ్టీ ఆడిట్‌ల ఆధారంగా రిమ్స్‌లో అవసరమైన మరమ్మతులు, అదనపు మౌలిక వసతులు, పునరుద్ధరణ పనులు, కొత్త భవనాల నిర్మాణం, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రి తెలిపారు. రిమ్స్‌లో మెయింటెనెన్స్, మానిటరింగ్, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తామని చెప్పారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం బయటపడినా, నిబంధనల ప్రకారం తగిన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిమ్స్‌లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, అవసరమైన మానవ వనరులను సమకూర్చడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరంద్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- అదిలాబాద్ కు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ....... ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నేపథ్యంలో జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, MLA పాయల్ శంకర్ ఏరోడ్రం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి, ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.1
- యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.1
- భైంసా : రూ.20 వేలకు లడ్డును దక్కించుకున్న జిల్లా ఎస్పీ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘంలో లడ్డు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో వినాయకుని లడ్డూని రూ.20 వేలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దక్కించుకున్నారు.ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు ఎస్పీకి లడ్డును అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి,హిందూ ఉత్సవ సమితి సభ్యులు,వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు1
- వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.1
- రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన బోథ్ MLA అనిల్ జాదవ్.... ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన చిన్నారులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.1
- During Exercise Veer Guardian26, Air Chief Marshal AP Singh, Chief of the Air Staff, and General Takehiro Morita, Chief of Staff , Japan Air Self-Defense Force, took to the skies in the LCA Tejas at Air Force Station Jodhpur. Flying as ‘Eagle One’, Air Chief Marshal AP Singh led the formation, while General Takehiro Morita flew the twin-seater Tejas, showcasing India’s indigenous aerospace capabilities and the growing operational synergy, interoperability & strong partnership between the IAF and JASDF.1
- లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది. దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1
- ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు... ఆదిలాబాద్ BREAKING NEWS ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న ... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు 23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స1