Shuru
Apke Nagar Ki App…
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Mirza Hassan Baig
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.1
- అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.1
- గోశాలలు–ఆశ్రమాల సందర్శనతో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు విస్తరణ గోమాతల సేవతో పాటు విద్యార్థులకు పాఠ్య సామగ్రి పంపిణీ – సమాజ సేవలో ముందంజ బోధన్ డివిజన్ లో చేయూత గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ సమీప అంబం(ఆర్) గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ఆంజనేయ గోశాలను సభ్యులు సందర్శించారు. సుమారు 12 నంది, గోమాతలతో కొనసాగుతున్న ఈ గోశాల పురాతన బురుజు ప్రాంగణంలో మహాదేవుని సన్నిధిలో నెలకొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రూపు సభ్యులు గోమాతలకు ఆహారంగా బెల్లం, పచ్చి శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు తినిపించారు. అనంతరం గో సంరక్షణ ప్రాముఖ్యత, చేయూత గ్రూపు కార్యకలాపాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గోశాల అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్లెపు గంగాధర్ (సర్పంచ్)తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల, అనాధ–పేద విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించారు. సహజ వాతావరణంలో విస్తరించిన ఈ ఆశ్రమంలో గోమాతలను పరిశీలించిన సభ్యులు వాటికి ఆహారంగా తీసుకువచ్చిన బెల్లం, శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు అందజేశారు. ఆశ్రమంలో స్వయం సమృద్ధిగా పండించే కూరగాయలు, ధాన్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి 19 మంది విద్యార్థులకు శ్రీమద్భగవద్గీత గ్రంథాలు, టావెల్స్, ఎగ్జామ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, నడవడికను సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమాల్లో చేయూత గ్రూపు వ్యవస్థాపకుడు నందల శంకర్ ఆధ్వర్యంలో సిందే సురేష్, బోడ నరహరి, భేతి సాయిలు, మురళి పాల్గొన్నారు. ఆశ్రమ సూపరింటెండెంట్, మేనేజర్ సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి2
- భైంసా : రూ.20 వేలకు లడ్డును దక్కించుకున్న జిల్లా ఎస్పీ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘంలో లడ్డు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో వినాయకుని లడ్డూని రూ.20 వేలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దక్కించుకున్నారు.ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు ఎస్పీకి లడ్డును అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి,హిందూ ఉత్సవ సమితి సభ్యులు,వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు1
- ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం: చల్లబడిన వాతావరణం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి 12.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. గత వారం రోజులుగా వర్షం జాడ లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు సంభవిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.1
- హసన్‌పల్లిలో హెల్త్ క్యాంప్.. . 4 మందికి వైద్య పరీక్షలు... మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.గ్రామ ప్రజలకు జ్వరం తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సులోచన, అంజలి ప్రజలకు సుమారు 40 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఎస్ మంగలి రాములు,హరిజన్ ఆశా వర్కర్లు సావిత్రి, పద్మ,లక్ష్మి,తదితరులు ఉన్నారు.4
- అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 22: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చౌరస్తా వద్ద ఉన్న అభి పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి చందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పాఠశాలకు చేరుకుని 9, 10వ తరగతులు నిర్వహిస్తున్న గదులను సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. పాఠశాల యాజమాన్యానికి గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి సీఆర్-5 న్యూస్ ఛానల్‌కు వెల్లడించినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన అనుమతులు లేకుండా 9, 10వ తరగతుల్లో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల చదువు, పరీక్షలు, తదుపరి విద్యకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.1
- ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు... ఆదిలాబాద్ BREAKING NEWS ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న ... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు 23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స1