logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం: చల్లబడిన వాతావరణం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి 12.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. గత వారం రోజులుగా వర్షం జాడ లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు సంభవిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.

1 hr ago
user_Vukkalkar Rajendernath
Vukkalkar Rajendernath
ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago

ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం: చల్లబడిన వాతావరణం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి 12.30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. గత వారం రోజులుగా వర్షం జాడ లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు సంభవిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
    1
    మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు
పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    13 hrs ago
  • రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా ​రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    1
    రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం
మెదక్ జిల్లా ​రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
    1
    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
    1
    గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన 
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    1
    పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్..............
టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే 
మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    6 hrs ago
  • పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది
    4
    పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు 
ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది
    user_పల్లె చిన్నికృష్ణ గౌడ్
    పల్లె చిన్నికృష్ణ గౌడ్
    దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ
కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణపతి హోమం కార్యక్రమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మరకత జీవనజ్యోతి లింగాలయం వద్ద తొమ్మిదో రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణపతి హోమం కార్యక్రమం
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మరకత జీవనజ్యోతి లింగాలయం వద్ద తొమ్మిదో రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు... ఆదిలాబాద్ BREAKING NEWS ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న ... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు 23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స
    1
    ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు...
ఆదిలాబాద్ BREAKING NEWS 
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ
పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు
సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్
ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు
షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి
మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత
ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న
... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు
23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.