Shuru
Apke Nagar Ki App…
రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.1
- సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.2
- సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌంట్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆది శ్రీనివాస్‌తో పాటు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యంలో గులాబి లీడర్ల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. నేతన్నల జీవితాల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏమిటో కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించామని, నేతన్నలకు సంబంధించిన సుమారు రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులపై ప్రస్తావించారు. నేతన్నలకు అండగా నిలవడానికి సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా చెల్లించబోతున్నట్లు తెలిపారు. తొమ్మిదో ప్యాకేజీ, ఎగువ మానేరు, కాలువల నిర్మాణం, సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్లక్ష్యం తదితర అంశాలపై కూడా వారు గత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేటీఆర్ గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములు కొలగొట్టి కల్వకుంట్ల కుటుంబం కట్టిన ఫామ్ లపై ఫామ్ హౌస్ ఫైల్స్ అనే సినిమా తీసే అవసరం ఉందని, అలాగే ధరణి పోర్టల్, జీవో 22ఏ లను అడ్డుపెట్టుకొని కేటీఆర్ అనుచరులు సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో సీఎం హోదాలో రాజన్న దర్శనానికి వచ్చిన కేసీఆర్ ఏటా వంద కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తానని రాజన్నకే శఠకోపం పెట్టాడని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 250 కోట్ల నిధులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసిల్లలో సీఎం పర్యటన అనంతరం సిరిసిల్ల ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులు, గతంలో జరిగిన పరిణామాలపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఈ నెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించేందుకు సభ వేదికగా నిలుస్తుందన్నారు.4
- హసన్‌పల్లిలో హెల్త్ క్యాంప్.. . 4 మందికి వైద్య పరీక్షలు... మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.గ్రామ ప్రజలకు జ్వరం తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సులోచన, అంజలి ప్రజలకు సుమారు 40 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఎస్ మంగలి రాములు,హరిజన్ ఆశా వర్కర్లు సావిత్రి, పద్మ,లక్ష్మి,తదితరులు ఉన్నారు.4
- అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.1
- పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯1
- సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.1
- వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.* *200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.* *ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.* *ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.* *నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.* *శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.* *వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ.* వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు. *గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.* 👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు. 👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. 👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి. 👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.4
- తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.1