వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.* *200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.* *ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.* *ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.* *నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.* *శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.* *వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ.* వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు. *గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.* 👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు. 👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. 👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి. 👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.* *200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.* *ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.* *ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.* *నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.* *శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.* *వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా
ఎస్పీ.* వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు
ఎస్పీ పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు. *గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.* 👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు. 👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే
విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. 👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి. 👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.2
- పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది4
- ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.4
- వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.1
- సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.1
- జగిత్యాల జిల్లా బతికేపల్లి గణేష్ మండపంలో విషాదం... కరెంట్ షాక్ తో యువకుడు మృతి, మరో యువకునికి గాయాలు గణేష్ ఉత్సవాలు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో విషాదం నింపింది. గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు మధు మృతి చెందారు. అతన్ని కాపాడేందుకు యత్నించిన యువకుడు అఖిల్ తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అఖిల్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి గణేష్ మండపంలో దీపారాధన సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో మండపంలో ఉన్న బాక్సులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా బాక్స్ కు కరెంట్ వైరు తాకి డిగ్రీ విద్యార్థి మధు షాక్ గురై పడిపోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన అఖిల్ గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మధు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. గణేష్ వేడుకల్లో యువకుడు మధు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గణేష్ మండపాల వద్ద భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.1
- నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం జగిత్యాల జిల్లా నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం గొల్లపెల్లి మండల ఎంఈఓ రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన.... సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....1
- లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడిస్తూ మాట్లాడుతూ, ఫిర్యాదురాలు చింతకుంట చంద్రవ్వ, భర్త హనుమంతు, లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందినవారు. ఫిర్యాదురాలి కుమార్తె గత 10 సంవత్సరాలుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్యతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ వద్ద ఉన్న సమయంలో సాయిలు తన గ్రామానికి రావాలని బలవంతం చేస్తూ, రాకపోతే చంపేస్తానని పలుమార్లు ఫోన్‌లో బెదిరించినట్లు ఫిర్యాదురాలు తెలిపింది. ఈ క్రమంలో తేదీ 18.09.2026న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి ఆమె కుమార్తె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది. అనంతరం నాగారం గ్రామ శివారులో తలకు బలమైన గాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో ఫిర్యాదురాలు లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టగా నిందితుడు గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్య, వయస్సు 48 సంవత్సరాలు, కొరుపోలు గ్రామం, లింగంపేట్ మండలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, తేదీ 19.09.2026 ఉదయం సుమారు 11.00 గంటలకు భూమి డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్‌తో మాట్లాడించాడు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు సాయంత్రం సుమారు 5.00 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు గుట్టమీది సాయిలును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉంది. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.1