logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం జగిత్యాల జిల్లా నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం గొల్లపెల్లి మండల ఎంఈఓ రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన.... సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....

3 hrs ago
user_Ntv నాగరాజు
Ntv నాగరాజు
వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
3 hrs ago

నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం జగిత్యాల జిల్లా నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం గొల్లపెల్లి మండల ఎంఈఓ రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన.... సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....

More news from తెలంగాణ and nearby areas
  • యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
    1
    యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి
యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • సింగరేణిలో మెటీరియల్ కొరతతో కార్మికుల భద్రతను పణంగా పెట్టొద్దు., * కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జి.ఎం. కార్యాలయాలను ముట్టడిస్తాం.. ఏఐటీయూసీ సింగరేణిలో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన కీలక మెటీరియల్స్‌ను సకాలంలో అందించడంలో యాజమాన్యం విఫలమవుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1 ఇంక్లైన్, జీడీకే-2వ ఇంక్లైన్ మరియు జీడీకే-11వ ఇంక్లైన్ లలో జరిగిన వినతి పత్రాల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో మెటీరియల్ కొరత పేరుతో కార్మికుల భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. గనుల్లో పని చేయడానికి అవసరమైన ప్రాథమిక మెటీరియల్స్ కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు గత కొన్ని నెలలుగా సకాలంలో అందకపోవడంతో గనుల్లో ఉత్పత్తి పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రీకండిషన్ డ్రిల్ బిట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. సపోర్ట్ మెన్‌కు అత్యవసరంగా అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూఫ్ బోల్టింగ్‌కు అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ కొరత ఏర్పడితే గని భద్రతా చర్యలపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లైన్‌మెన్‌కు అవసరమైన కీళ్లు తదితర సామగ్రిని వెంటనే సరఫరా చేయాలని, ట్రాక్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే టబ్బులు పట్టాలు తప్పడం, కిందపడటం వంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులకు జూన్, జూలై నెలల్లో అందాల్సిన సేఫ్టీ షూస్ సెప్టెంబర్ వచ్చినా ఇంకా అందకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని యాజమాన్యంపై మండిపడ్డారు. గ్లౌజెస్ నుంచి ఎస్.డి.ఎల్ ఆయిల్ వరకు అన్నింటిలో కొరతేనా? అని ప్రశ్నించారు. కార్మికులకు అవసరమైన నాణ్యమైన గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ లకు అవసరమైన నాణ్యమైన ఆయిల్, గిరిమీట్లు తదితర మెటీరియల్స్‌ను, అలాగే నూతన రంగుతో కూడిన ఒకే రకం యూనిఫామ్‌ను అన్ని గనుల్లో వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. “ఉత్పత్తి లక్ష్యాలు గుర్తుంటే, కార్మికుల భద్రత ఎందుకు గుర్తుండదు? కార్మికుల నుంచి పని ఆశిస్తే.. పని చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఎందుకు ఇవ్వరు?” అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఏఐటీయూసీ సహించబోదని, ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనుల్లో కార్మికులకు అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, రెజిన్ క్యాప్సిల్స్, సేఫ్టీ షూస్, గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ ఆయిల్, గిరిమీట్లు, ట్రాక్ మెటీరియల్స్, యూనిఫామ్ తదితర అవసరమైన సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితుల విషయంలో ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో పై సమస్యల సాధన కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆఫీస్ బేరర్స్ *సంకె అశోక్, మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, సుధాకర్*, అన్ని గనుల పిట్ సెక్రటరీలు *మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్*, నాయకులు *గొడిశెల నరేశ్, పి. రవి, సాన జలపతి, చంద తిరుపతి, బి. సమ్మయ్య*, మైన్స్, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సింగరేణిలో మెటీరియల్ కొరతతో కార్మికుల భద్రతను పణంగా పెట్టొద్దు., 
* కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జి.ఎం. కార్యాలయాలను ముట్టడిస్తాం.. ఏఐటీయూసీ

సింగరేణిలో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన కీలక మెటీరియల్స్‌ను సకాలంలో అందించడంలో యాజమాన్యం విఫలమవుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1 ఇంక్లైన్, జీడీకే-2వ ఇంక్లైన్ మరియు జీడీకే-11వ ఇంక్లైన్ లలో జరిగిన వినతి పత్రాల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో మెటీరియల్ కొరత పేరుతో కార్మికుల భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదని వారు స్పష్టం చేశారు.
గనుల్లో పని చేయడానికి అవసరమైన ప్రాథమిక మెటీరియల్స్ కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు గత కొన్ని నెలలుగా సకాలంలో అందకపోవడంతో గనుల్లో ఉత్పత్తి పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రీకండిషన్ డ్రిల్ బిట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
సపోర్ట్ మెన్‌కు అత్యవసరంగా అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూఫ్ బోల్టింగ్‌కు అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ కొరత ఏర్పడితే గని భద్రతా చర్యలపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లైన్‌మెన్‌కు అవసరమైన కీళ్లు తదితర సామగ్రిని వెంటనే సరఫరా చేయాలని, ట్రాక్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే టబ్బులు పట్టాలు తప్పడం, కిందపడటం వంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులకు జూన్, జూలై నెలల్లో అందాల్సిన సేఫ్టీ షూస్ సెప్టెంబర్ వచ్చినా ఇంకా అందకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని యాజమాన్యంపై మండిపడ్డారు.
గ్లౌజెస్ నుంచి ఎస్.డి.ఎల్ ఆయిల్ వరకు అన్నింటిలో కొరతేనా? అని ప్రశ్నించారు. కార్మికులకు అవసరమైన నాణ్యమైన గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ లకు అవసరమైన నాణ్యమైన ఆయిల్, గిరిమీట్లు తదితర మెటీరియల్స్‌ను, అలాగే నూతన రంగుతో కూడిన ఒకే రకం యూనిఫామ్‌ను అన్ని గనుల్లో వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. “ఉత్పత్తి లక్ష్యాలు గుర్తుంటే, కార్మికుల భద్రత ఎందుకు గుర్తుండదు? కార్మికుల నుంచి పని ఆశిస్తే.. పని చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఎందుకు ఇవ్వరు?” అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఏఐటీయూసీ సహించబోదని, ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనుల్లో కార్మికులకు అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, రెజిన్ క్యాప్సిల్స్, సేఫ్టీ షూస్, గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ ఆయిల్, గిరిమీట్లు, ట్రాక్ మెటీరియల్స్, యూనిఫామ్ తదితర అవసరమైన సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితుల విషయంలో ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో పై సమస్యల సాధన కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆఫీస్ బేరర్స్ *సంకె అశోక్, మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, సుధాకర్*, అన్ని గనుల పిట్ సెక్రటరీలు *మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్*, నాయకులు *గొడిశెల నరేశ్, పి. రవి, సాన జలపతి, చంద తిరుపతి, బి. సమ్మయ్య*, మైన్స్, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.* *200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.* *ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.* *ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.* *నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.* *శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.* *వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ.* వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు. *గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.* 👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు. 👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. 👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి. 👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
    4
    వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.*

*200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.*

*ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.*

*ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.*

*నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.*

*శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.*

*వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ.*

వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు.
*గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.*
👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు.
👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.
👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి.
👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • 8 వేల ఎకరాల భూ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..! జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, 2,400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోపణలకు ఆధారాలు, భూముల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తూ, న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
    1
    8 వేల ఎకరాల భూ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..!
జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య 
జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, 2,400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోపణలకు ఆధారాలు, భూముల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తూ, న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    1
    టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి
టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    user_Akudari Devendar
    Akudari Devendar
    Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    2
    సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఒక్కసారిగా మారిన వాతావరణం... జగిత్యాల జిల్లా ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో భారీ వర్షం ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం ఒక్కసారిగా మారిన వాతావరణం... భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చేరిన వర్షపు నీరు
    1
    ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఒక్కసారిగా మారిన వాతావరణం... 
జగిత్యాల జిల్లా 
ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో భారీ వర్షం
ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం
ఒక్కసారిగా మారిన వాతావరణం...
భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చేరిన వర్షపు నీరు
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • సింగరేణి ఏరియాలో వైఎస్ పాలనలో పట్టాలిచ్చాం - ఇప్పుడు 76జిఓ తో కూడా పట్టాలిస్తాం : రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న తీరుపై సహించలేక అవాకులు చివాకులు చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్ మాటల తీరు పద్ధతి కాదని వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాలన చేస్తున్న తిరలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
    1
    సింగరేణి ఏరియాలో వైఎస్ పాలనలో పట్టాలిచ్చాం - ఇప్పుడు 76జిఓ తో కూడా పట్టాలిస్తాం : రామగుండం మేయర్ మహంకాళి స్వామి
ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న తీరుపై సహించలేక అవాకులు చివాకులు చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్ మాటల తీరు పద్ధతి కాదని వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాలన చేస్తున్న తిరలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్  కార్పొరేటర్లు నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది. దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    1
    లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది. దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.