logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.

4 hrs ago
user_Sircilla jilla updates
Sircilla jilla updates
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
4 hrs ago

సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    2
    సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌంట్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆది శ్రీనివాస్‌తో పాటు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యంలో గులాబి లీడర్ల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. నేతన్నల జీవితాల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏమిటో కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించామని, నేతన్నలకు సంబంధించిన సుమారు రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులపై ప్రస్తావించారు. నేతన్నలకు అండగా నిలవడానికి సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా చెల్లించబోతున్నట్లు తెలిపారు. తొమ్మిదో ప్యాకేజీ, ఎగువ మానేరు, కాలువల నిర్మాణం, సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్లక్ష్యం తదితర అంశాలపై కూడా వారు గత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేటీఆర్‌ గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములు కొలగొట్టి కల్వకుంట్ల కుటుంబం కట్టిన ఫామ్ లపై ఫామ్ హౌస్ ఫైల్స్ అనే సినిమా తీసే అవసరం ఉందని, అలాగే ధరణి పోర్టల్, జీవో 22ఏ లను అడ్డుపెట్టుకొని కేటీఆర్ అనుచరులు సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో సీఎం హోదాలో రాజన్న దర్శనానికి వచ్చిన కేసీఆర్ ఏటా వంద కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తానని రాజన్నకే శఠకోపం పెట్టాడని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 250 కోట్ల నిధులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసిల్లలో సీఎం పర్యటన అనంతరం సిరిసిల్ల ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులు, గతంలో జరిగిన పరిణామాలపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఈ నెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించేందుకు సభ వేదికగా నిలుస్తుందన్నారు.
    4
    సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 
సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి టూర్ ప్రకటనతో కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, సెప్టెంబర్ 30 నుండి సిరిసిల్లలో కేటీఆర్ కు కౌంట్ డౌన్ మొదలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆది శ్రీనివాస్‌తో పాటు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  సిరిసిల్లలో సీఎం పర్యటన నేపథ్యంలో గులాబి లీడర్ల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. నేతన్నల జీవితాల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏమిటో కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించామని, నేతన్నలకు సంబంధించిన సుమారు రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులపై ప్రస్తావించారు. నేతన్నలకు అండగా నిలవడానికి సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా చెల్లించబోతున్నట్లు తెలిపారు. తొమ్మిదో ప్యాకేజీ, ఎగువ మానేరు, కాలువల నిర్మాణం, సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్లక్ష్యం తదితర అంశాలపై కూడా వారు గత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, భూసేకరణ చేపట్టి పనులను వేగవంతం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
కేటీఆర్‌ గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములు కొలగొట్టి కల్వకుంట్ల కుటుంబం కట్టిన ఫామ్ లపై ఫామ్ హౌస్ ఫైల్స్ అనే సినిమా తీసే అవసరం ఉందని, అలాగే ధరణి పోర్టల్, జీవో 22ఏ లను అడ్డుపెట్టుకొని కేటీఆర్ అనుచరులు సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో సీఎం హోదాలో రాజన్న దర్శనానికి వచ్చిన కేసీఆర్ ఏటా  వంద కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తానని రాజన్నకే శఠకోపం  పెట్టాడని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 250 కోట్ల నిధులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసిల్లలో సీఎం పర్యటన అనంతరం సిరిసిల్ల ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులు, గతంలో జరిగిన పరిణామాలపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఈ నెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించేందుకు సభ వేదికగా నిలుస్తుందన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.* *200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.* *ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.* *ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.* *నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.* *శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.* *వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ.* వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు. *గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.* 👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు. 👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. 👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి. 👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
    4
    వేములవాడలో గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి.*

*200 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత.*

*ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలి.*

*ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు.*

*నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి.*

*శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు.*

*వేములవాడ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఆలయ గుడి చెరువు వద్ద ఏర్పాట్లను మంగళవారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ.*

వేములవాడ పట్టణ పరిధిలో సుమారు 320 గణేష్ మండపాల్లో గణనాథులు కొలువుదీరగా, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం, శోభాయాత్రను “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు తదితర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పికెట్లు, పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, ఏలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా సహకరించాలని కోరారు.
*గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి.*
👉 నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు.
👉 గణేష్ మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ఆలస్యం చేయకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.
👉 శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాటలు వినిపించడం, బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
👉 శోభాయాత్రలో క్రమపద్ధతిలో క్యూ పాటిస్తూ, వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉 మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
👉 శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన పోలీస్ వారికి సమాచారం అందించాలి.
👉 శోభాయాత్ర సందర్భంగా పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • 8 వేల ఎకరాల భూ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..! జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, 2,400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోపణలకు ఆధారాలు, భూముల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తూ, న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
    1
    8 వేల ఎకరాల భూ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..!
జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య 
జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, 2,400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోపణలకు ఆధారాలు, భూముల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తూ, న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది
    4
    పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు 
ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది
    user_పల్లె చిన్నికృష్ణ గౌడ్
    పల్లె చిన్నికృష్ణ గౌడ్
    దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది. కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్: 3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. ఈ సందర్భంగా దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
    3
    భక్తి... ఆనందం... ఉత్సాహంతో భవానీనగర్ రోడ్ నంబర్–3లో పండుగ వాతావరణం నెలకొంది.
కట్టారాంపూర్ భవాని నగర్ రోడ్ నెంబర్:  3 లో ఘనంగా గణపతి పూజా వేడుకలు
కరీంనగర్ కట్టారాంపూర్ భవానీనగర్ రోడ్ నంబర్–3లో గణపతి పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.
ఈ సందర్భంగా  దీపాలంకరణలతో గణపతి మండపాన్ని సుందరంగా అలంకరించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    40 min ago
  • భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్‌లో భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. **Shreya Infra and Marketing Private Limited** పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ, తక్కువ కాలంలో పెట్టుబడులను రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను లక్నోలో అరెస్ట్ చేశారు. 2024 మే నుంచి పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిపివేసినట్లు విచారణలో వెల్లడైంది. CCS ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించింది. బాధితులు సమీప పోలీస్ స్టేషన్ లేదా CCS కరీంనగర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
    3
    భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించిన కరీంనగర్ పోలీసులు
కరీంనగర్‌లో భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. **Shreya Infra and Marketing Private Limited** పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ, తక్కువ కాలంలో పెట్టుబడులను రెండింతలు, మూడింతలు చేస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను లక్నోలో అరెస్ట్ చేశారు. 2024 మే నుంచి పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిపివేసినట్లు విచారణలో వెల్లడైంది. CCS ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించింది. బాధితులు సమీప పోలీస్ స్టేషన్ లేదా CCS కరీంనగర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    2
    సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.