logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Sircilla jilla updates
Sircilla jilla updates
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
4 hrs ago

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    4
    ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు  ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా ​రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    1
    రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం
మెదక్ జిల్లా ​రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    వెల్గటూర్ ఆదర్శ యూత్  ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ 
వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.
    1
    సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్.
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లా బతికేపల్లి గణేష్ మండపంలో విషాదం... కరెంట్ షాక్ తో యువకుడు మృతి, మరో యువకునికి గాయాలు గణేష్ ఉత్సవాలు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో విషాదం నింపింది. గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు మధు మృతి చెందారు. అతన్ని కాపాడేందుకు యత్నించిన యువకుడు అఖిల్ తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అఖిల్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి గణేష్ మండపంలో దీపారాధన సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో మండపంలో ఉన్న బాక్సులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా బాక్స్ కు కరెంట్ వైరు తాకి డిగ్రీ విద్యార్థి మధు షాక్ గురై పడిపోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన అఖిల్ గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మధు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. గణేష్ వేడుకల్లో యువకుడు మధు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గణేష్ మండపాల వద్ద భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
    1
    జగిత్యాల జిల్లా బతికేపల్లి గణేష్ మండపంలో విషాదం... కరెంట్ షాక్ తో యువకుడు మృతి, మరో యువకునికి గాయాలు
గణేష్ ఉత్సవాలు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో విషాదం నింపింది. గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు మధు మృతి చెందారు. అతన్ని కాపాడేందుకు యత్నించిన  యువకుడు అఖిల్ తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అఖిల్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి గణేష్ మండపంలో దీపారాధన సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో మండపంలో ఉన్న బాక్సులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా బాక్స్ కు కరెంట్ వైరు తాకి డిగ్రీ విద్యార్థి మధు షాక్ గురై పడిపోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన అఖిల్ గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మధు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. గణేష్ వేడుకల్లో యువకుడు మధు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గణేష్ మండపాల వద్ద భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం జగిత్యాల జిల్లా నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం గొల్లపెల్లి మండల ఎంఈఓ రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన.... సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....
    1
    నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ  ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
జగిత్యాల జిల్లా
నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ  ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
గొల్లపెల్లి మండల  ఎంఈఓ  రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....
సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన
అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత..! గణేశ్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలని బీజేపీ ధర్నా..పోలీసులతో వాగ్వాదం కార్యకర్తల అరెస్టు.. లాఠీఛార్జ్‌పై బీజేపీ నేతల ఆగ్రహం.. గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట కెనాల్ వద్ద ధర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై పోలీసులు దాడి చేశారని, పలువురు కార్యకర్తలను గల్లా పట్టుకుని లాగి పడేశారని వారు ఆరోపించారు. ఏసీపీ విజయ్‌కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావును పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. గణేశ్ నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని కోరితే లాఠీలతో కొట్టడం ఏమిటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ప్రశ్నించారు. హిందూ పండుగలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావన అని నిలదీశారు. నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిమజ్జనానికి నీటిని అడిగినందుకు బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం హేయమని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు అన్నారు. కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. నీటిని విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. గణేశ్ నిమజ్జనం కోసం అర టీఎంసీ నీటిని అడిగితే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని డిప్యూటీ మేయర్ సునీల్‌రావు అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? లేక కోదాడ, హుజూర్‌నగర్ మంత్రిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిచేసినప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం దారుణమన్నారు. నిమజ్జనానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకుంటే పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం బీజేపీ ఆందోళన నేపథ్యంలో గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం మరో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. విడుదలైన ఎస్సారెస్పీ జలాలు రేపు రాత్రిలోపు చింతకుంట కెనాల్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గణేశ్ నిమజ్జనానికి నీటి సమస్యపై బీజేపీ చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం నుంచి స్పందన లభించినట్లైంది.
    1
    చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత..!

గణేశ్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలని బీజేపీ ధర్నా..పోలీసులతో వాగ్వాదం

కార్యకర్తల అరెస్టు.. లాఠీఛార్జ్‌పై బీజేపీ నేతల ఆగ్రహం..


గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట కెనాల్ వద్ద ధర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై పోలీసులు దాడి చేశారని, పలువురు కార్యకర్తలను గల్లా పట్టుకుని లాగి పడేశారని వారు ఆరోపించారు. ఏసీపీ విజయ్‌కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావును పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. గణేశ్ నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని కోరితే లాఠీలతో కొట్టడం ఏమిటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ప్రశ్నించారు. హిందూ పండుగలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావన అని నిలదీశారు. నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిమజ్జనానికి నీటిని అడిగినందుకు బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం హేయమని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు అన్నారు. కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. నీటిని విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. గణేశ్ నిమజ్జనం కోసం అర టీఎంసీ నీటిని అడిగితే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని డిప్యూటీ మేయర్ సునీల్‌రావు అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? లేక కోదాడ, హుజూర్‌నగర్ మంత్రిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిచేసినప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం దారుణమన్నారు. నిమజ్జనానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకుంటే పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం
బీజేపీ ఆందోళన నేపథ్యంలో గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం మరో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. విడుదలైన ఎస్సారెస్పీ జలాలు రేపు రాత్రిలోపు చింతకుంట కెనాల్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గణేశ్ నిమజ్జనానికి నీటి సమస్యపై బీజేపీ చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం నుంచి స్పందన లభించినట్లైంది.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    22 hrs ago
  • లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడిస్తూ మాట్లాడుతూ, ఫిర్యాదురాలు చింతకుంట చంద్రవ్వ, భర్త హనుమంతు, లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందినవారు. ఫిర్యాదురాలి కుమార్తె గత 10 సంవత్సరాలుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్యతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ వద్ద ఉన్న సమయంలో సాయిలు తన గ్రామానికి రావాలని బలవంతం చేస్తూ, రాకపోతే చంపేస్తానని పలుమార్లు ఫోన్‌లో బెదిరించినట్లు ఫిర్యాదురాలు తెలిపింది. ఈ క్రమంలో తేదీ 18.09.2026న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి ఆమె కుమార్తె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది. అనంతరం నాగారం గ్రామ శివారులో తలకు బలమైన గాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో ఫిర్యాదురాలు లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టగా నిందితుడు గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్య, వయస్సు 48 సంవత్సరాలు, కొరుపోలు గ్రామం, లింగంపేట్ మండలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, తేదీ 19.09.2026 ఉదయం సుమారు 11.00 గంటలకు భూమి డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్‌తో మాట్లాడించాడు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు సాయంత్రం సుమారు 5.00 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు గుట్టమీది సాయిలును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉంది. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    1
    లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం
లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం
సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ  ఎస్. శ్రీనివాస్ రావు
ఎల్లారెడ్డి డీఎస్పీ  ఎస్. శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడిస్తూ మాట్లాడుతూ, ఫిర్యాదురాలు చింతకుంట చంద్రవ్వ, భర్త హనుమంతు, లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందినవారు. ఫిర్యాదురాలి కుమార్తె గత 10 సంవత్సరాలుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్యతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ వద్ద ఉన్న సమయంలో సాయిలు తన గ్రామానికి రావాలని బలవంతం చేస్తూ, రాకపోతే చంపేస్తానని పలుమార్లు ఫోన్‌లో బెదిరించినట్లు ఫిర్యాదురాలు తెలిపింది. ఈ క్రమంలో తేదీ 18.09.2026న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి ఆమె కుమార్తె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది. అనంతరం నాగారం గ్రామ శివారులో తలకు బలమైన గాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో ఫిర్యాదురాలు లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసును జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర,  ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టగా నిందితుడు గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్య, వయస్సు 48 సంవత్సరాలు, కొరుపోలు గ్రామం, లింగంపేట్ మండలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, తేదీ 19.09.2026 ఉదయం సుమారు 11.00 గంటలకు భూమి డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్‌తో మాట్లాడించాడు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు సాయంత్రం సుమారు 5.00 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు గుట్టమీది సాయిలును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉంది.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.