ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన
సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్
తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు
ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
- సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పరిశీలించారు. రంగినేని ట్రస్ట్ సమీపంలోని స్థలం సభకు అనుకూలంగా ఉందని నిర్ణయించి ఖరారు చేశారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.2
- 8 వేల ఎకరాల భూ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..! జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, 2,400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోపణలకు ఆధారాలు, భూముల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తూ, న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.1
- రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* *రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* 1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో. 2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. 3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది. 4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు. 5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన. 6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు. 7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు. 8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది. 9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది. 10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి. 11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది. 12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి. 13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది. 14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది. 16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది. 17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు. 18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది. 19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం. 20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.1
- పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది4
- డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి: బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- వెల్గటూర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతికి దీపోత్సవ పూజ వినాయక నవరాత్రి ఉఏత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు స్వామి వారికి ఘనంగా దీపోత్సవ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- సిరిసిల్లలో కేటీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రకటనతో కేటీఆర్‌కు వణుకు మొదలైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 30న సీఎం సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తూ రూ.350 కోట్ల బకాయిల చెల్లింపులు, రూ.49 కోట్ల విద్యుత్ బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం సభలో ప్రజలకు వివరిస్తామన్నారు.1
- సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం...ఇద్దరు చిన్నారులు మృతి...మరో ఇద్దరి పరిస్థితి విషమం... విచారం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. పిల్లల వార్డులో ఏసీ పేలడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. 21 మంది పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రిమ్స్ లో అధికారులు సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. రిమ్స్ కు చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీశారు.షార్ట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు.1