logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి: బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

11 hrs ago
user_Devender Pasunoori
Devender Pasunoori
Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
11 hrs ago

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి: బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.
    1
    శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి  గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • జగిత్యాల జిల్లా బతికేపల్లి గణేష్ మండపంలో విషాదం... కరెంట్ షాక్ తో యువకుడు మృతి, మరో యువకునికి గాయాలు గణేష్ ఉత్సవాలు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో విషాదం నింపింది. గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు మధు మృతి చెందారు. అతన్ని కాపాడేందుకు యత్నించిన యువకుడు అఖిల్ తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అఖిల్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి గణేష్ మండపంలో దీపారాధన సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో మండపంలో ఉన్న బాక్సులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా బాక్స్ కు కరెంట్ వైరు తాకి డిగ్రీ విద్యార్థి మధు షాక్ గురై పడిపోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన అఖిల్ గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మధు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. గణేష్ వేడుకల్లో యువకుడు మధు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గణేష్ మండపాల వద్ద భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
    1
    జగిత్యాల జిల్లా బతికేపల్లి గణేష్ మండపంలో విషాదం... కరెంట్ షాక్ తో యువకుడు మృతి, మరో యువకునికి గాయాలు
గణేష్ ఉత్సవాలు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో విషాదం నింపింది. గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు మధు మృతి చెందారు. అతన్ని కాపాడేందుకు యత్నించిన  యువకుడు అఖిల్ తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అఖిల్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి గణేష్ మండపంలో దీపారాధన సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో మండపంలో ఉన్న బాక్సులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా బాక్స్ కు కరెంట్ వైరు తాకి డిగ్రీ విద్యార్థి మధు షాక్ గురై పడిపోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన అఖిల్ గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మధు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. గణేష్ వేడుకల్లో యువకుడు మధు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గణేష్ మండపాల వద్ద భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • మహబూబాబాద్ ప్రజలకు అద్భుతమైన విహార స్థలం 'ఈదుల పూసపల్లి చెరువు.... ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22..... కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు ఈరోజు ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పర్యాటకులకు సకల సౌకర్యాలు..... చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు (ఐలాండ్స్) ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ యోగా సెంటర్లు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్ మరియు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర బ్రహ్మాండమైన నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం "నభూతో నభవిష్యత్" అనేలా ఉందని ఆయన అభివర్ణించారు. మ్రానుకోట చారిత్రక నేపథ్యం.... పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కాబట్టి దీనికి 'మ్రానుకోట' అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోట, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని ఆయన గుర్తు చేశారు. మ్రానుకోట అసలు సిసలు రూపం ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన... ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్ఓ (DFO) తో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ 'మినీ జూ పార్క్' ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి:... మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వందలాది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో, చుట్టూ రింగ్ రోడ్డు మరియు అనుసంధాన రహదారుల నిర్మాణలతో మహబూబాబాద్‌ను మరింత వేగవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ప్రజలకు విజ్ఞప్తి: మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ గడపాలని సూచించారు. ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు స్పష్టం చేశారు.
    1
    మహబూబాబాద్ ప్రజలకు అద్భుతమైన విహార స్థలం 'ఈదుల పూసపల్లి చెరువు.... 
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. 
మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22..... 
కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు ఈరోజు ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
పర్యాటకులకు సకల సౌకర్యాలు..... 
చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు (ఐలాండ్స్) ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ యోగా సెంటర్లు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్ మరియు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర బ్రహ్మాండమైన నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం "నభూతో నభవిష్యత్" అనేలా ఉందని ఆయన అభివర్ణించారు.
మ్రానుకోట చారిత్రక నేపథ్యం.... 
పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కాబట్టి దీనికి 'మ్రానుకోట' అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోట, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని ఆయన గుర్తు చేశారు. మ్రానుకోట అసలు సిసలు రూపం ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. 
మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన... 
ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్ఓ (DFO) తో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ 'మినీ జూ పార్క్' ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి:... 
మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వందలాది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో, చుట్టూ రింగ్ రోడ్డు మరియు అనుసంధాన రహదారుల నిర్మాణలతో మహబూబాబాద్‌ను మరింత వేగవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. 
ప్రజలకు విజ్ఞప్తి:
మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ గడపాలని సూచించారు. ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు స్పష్టం చేశారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన మానవ తప్పిదం కారణంగానే జరిగిందని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారని కవిత పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే సమాచారం ఉందన్నారు. ముగ్గురు చిన్నారులు మృతి చెందినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస ఆర్థిక సాయం కూడా అందించలేదని ఆమె ఆరోపించారు. మృతుల్లో ఇద్దరు మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు, ఒకరు ఆదివాసీ కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలిపారు. అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
    1
    ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: టిఆర్ఎస్ చీఫ్ కవిత
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన మానవ తప్పిదం కారణంగానే జరిగిందని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారని కవిత పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే సమాచారం ఉందన్నారు.
ముగ్గురు చిన్నారులు మృతి చెందినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస ఆర్థిక సాయం కూడా అందించలేదని ఆమె ఆరోపించారు. మృతుల్లో ఇద్దరు మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు, ఒకరు ఆదివాసీ కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలిపారు. అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • * సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ... * గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం.... మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
    2
    * సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ...
* గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం....
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు... ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.
    1
    వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు...
ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    9 hrs ago
  • హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు! హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రానున్న సమయంలో వర్షం మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భారీ వర్షం, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే బయట ఉన్న ఉద్యోగులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
    1
    హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం
అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు!
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రానున్న సమయంలో వర్షం మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, వెదర్‌మ్యాన్ హెచ్చరించారు.
సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
భారీ వర్షం, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే బయట ఉన్న ఉద్యోగులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలని రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో,ధర్నా చేసిన నిరుపేద కుటుంబాలు.
    1
    అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలని రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో,ధర్నా చేసిన నిరుపేద కుటుంబాలు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం...ఇద్దరు చిన్నారులు మృతి...మరో ఇద్దరి పరిస్థితి విషమం... విచారం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. పిల్లల వార్డులో ఏసీ పేలడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. 21 మంది పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రిమ్స్ లో అధికారులు సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. రిమ్స్ కు చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీశారు.షార్ట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు.
    1
    ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం...ఇద్దరు చిన్నారులు మృతి...మరో ఇద్దరి పరిస్థితి విషమం... విచారం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ రెడ్డి 
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది.
పిల్లల వార్డులో ఏసీ పేలడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. 21 మంది పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రిమ్స్ లో అధికారులు సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. రిమ్స్ కు చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీశారు.షార్ట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. 
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.