logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు! హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రానున్న సమయంలో వర్షం మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భారీ వర్షం, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే బయట ఉన్న ఉద్యోగులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

3 hrs ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
3 hrs ago

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు! హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రానున్న సమయంలో వర్షం మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భారీ వర్షం, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే బయట ఉన్న ఉద్యోగులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* *రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* 1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో. 2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. 3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది. 4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు. 5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన. 6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు. 7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు. 8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది. 9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది. 10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి. 11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది. 12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి. 13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది. 14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది. 16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది. 17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు. 18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది. 19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం. 20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.
    1
    రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?*
*రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?*
1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో.
2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది.
3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది.
4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు.
5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన.
6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు.
7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు.
8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది.
9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది.
10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి.
11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది.
12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి.
13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది.
14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది.
16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది.
17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు.
18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది.
19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం.
20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి: బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి.
గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి:
బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి
33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ
వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    44 min ago
  • ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    1
    ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ 
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    14 hrs ago
  • నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
    1
    నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు
జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి? దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం: ఎర్రబెల్లి. వరంగల్, సెప్టెంబర్ 22: ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటనపై వారిని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని దాడి చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనలో ముగ్గురు గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన అనంతరం ఆస్పత్రిలో పరిస్థితులను అధికారులు పరిశీలించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను అడ్డుకుని పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు పోలీసులు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరుల విషయంలోనూ పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్న ఘటనలపై పార్టీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తా కథనాలు కూడా ఉన్నాయి. “కార్యకర్తలు అధైర్యపడొద్దు” ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడే నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.
    1
    వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి?
దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం: ఎర్రబెల్లి.
వరంగల్, సెప్టెంబర్ 22:
ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటనపై వారిని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని దాడి చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనలో ముగ్గురు గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన అనంతరం ఆస్పత్రిలో పరిస్థితులను అధికారులు పరిశీలించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను అడ్డుకుని పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు
పోలీసులు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరుల విషయంలోనూ పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్న ఘటనలపై పార్టీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తా కథనాలు కూడా ఉన్నాయి.
“కార్యకర్తలు అధైర్యపడొద్దు”
ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడే నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.
    user_Mr.Perfect
    Mr.Perfect
    Local News Reporter ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    3 hrs ago
  • ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    4
    ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు  ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు. _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.
    1
    _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు  ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.
_నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు  ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.