Shuru
Apke Nagar Ki App…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
P.srinu
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.1
- డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో న్యాయం చేయాలి అర్హులైన వారికి ఇళ్లు దక్కలేదని తక్కెడ్లపాడ్ గ్రామస్తుల ఆందోళన తహసీల్దార్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ శాలిగౌరారం: తక్కెడ్లపాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అర్హులైన తమకు ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి 2003–04 సంవత్సరంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పొందిన వారిని కలిసి, వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, “నాదే భరోసా” అని చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు శాలిగౌరారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసి, తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మోదల రాంబాబు, తిరుపారి రామ్మూర్తితో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.2
- ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి1
- నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.1
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఆరో వార్డు వినాయక దగ్గర మహిళలు డాన్స్ ఉత్సవాలు మంచిగా చేయడం జరుగుతుంది1
- గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.1
- హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు! హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రానున్న సమయంలో వర్షం మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భారీ వర్షం, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే బయట ఉన్న ఉద్యోగులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.1
- 39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.1
- శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.1