Shuru
Apke Nagar Ki App…
39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.
Bhaskar Reddy
39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.
More news from తెలంగాణ and nearby areas
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.1
- మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.1
- పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯1
- కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.1
- రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* *రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* 1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో. 2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. 3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది. 4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు. 5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన. 6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు. 7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు. 8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది. 9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది. 10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి. 11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది. 12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి. 13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది. 14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది. 16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది. 17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు. 18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది. 19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం. 20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.1
- రైతుల పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి బిజెపి నేత శ్రీ వర్ధన్ రెడ్డి పాలమూరు జిల్లాలోని రైతుల పంటలకు వెంటనే జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పర్యటనకు వెళ్తున్న బీజేపీ నేతలను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్న పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. సన్న వడ్లకు ఇవ్వాల్సిన రూ.500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రైతులను ఎండబెడుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 10 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కనీసం 6 నుంచి 7 టీఎంసీల నీరు కూడా లేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్తకోట, మదనాపురం నుంచి కొల్లాపూర్ వరకు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన క్షేత్రస్థాయికి వెళ్తున్న రామచందర్‌రావు, ఆచారి తదితర జిల్లా నేతలను అప్రజాస్వామికంగా అడ్డుకుని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.1
- 39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.1
- శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.1