రైతుల పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి బిజెపి నేత శ్రీ వర్ధన్ రెడ్డి పాలమూరు జిల్లాలోని రైతుల పంటలకు వెంటనే జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పర్యటనకు వెళ్తున్న బీజేపీ నేతలను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్న పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. సన్న వడ్లకు ఇవ్వాల్సిన రూ.500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రైతులను ఎండబెడుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 10 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కనీసం 6 నుంచి 7 టీఎంసీల నీరు కూడా లేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్తకోట, మదనాపురం నుంచి కొల్లాపూర్ వరకు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన క్షేత్రస్థాయికి వెళ్తున్న రామచందర్‌రావు, ఆచారి తదితర జిల్లా నేతలను అప్రజాస్వామికంగా అడ్డుకుని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రైతుల పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి బిజెపి నేత శ్రీ వర్ధన్ రెడ్డి పాలమూరు జిల్లాలోని రైతుల పంటలకు వెంటనే జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పర్యటనకు వెళ్తున్న బీజేపీ నేతలను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్న పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. సన్న వడ్లకు ఇవ్వాల్సిన రూ.500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రైతులను ఎండబెడుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 10 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కనీసం 6 నుంచి 7 టీఎంసీల నీరు కూడా లేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్తకోట, మదనాపురం నుంచి కొల్లాపూర్ వరకు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన క్షేత్రస్థాయికి వెళ్తున్న రామచందర్‌రావు, ఆచారి తదితర జిల్లా నేతలను అప్రజాస్వామికంగా అడ్డుకుని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
- రైతుల పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి బిజెపి నేత శ్రీ వర్ధన్ రెడ్డి పాలమూరు జిల్లాలోని రైతుల పంటలకు వెంటనే జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పర్యటనకు వెళ్తున్న బీజేపీ నేతలను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్న పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. సన్న వడ్లకు ఇవ్వాల్సిన రూ.500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రైతులను ఎండబెడుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 10 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కనీసం 6 నుంచి 7 టీఎంసీల నీరు కూడా లేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్తకోట, మదనాపురం నుంచి కొల్లాపూర్ వరకు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన క్షేత్రస్థాయికి వెళ్తున్న రామచందర్‌రావు, ఆచారి తదితర జిల్లా నేతలను అప్రజాస్వామికంగా అడ్డుకుని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.1
- కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.1
- ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి1
- వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్న పట్టణ ప్రజలు.. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలోని ఏడో వార్డు గుడిపల్లి కాలనీలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయి వెంటపడి కరిచేస్తున్నాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కుక్కలను నిర్మూలించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.1
- యెన్నేపల్లి–వికారాబాద్ మెయిన్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి అవసరం. వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు చేరడం కాదు… రోడ్డు ఎక్కడుంది, నది ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి! రోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇదే రోడ్డుపై మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే… రోడ్డు మాత్రం అందరికీ కనిపిస్తోంది, సమస్య మాత్రం ఎవరికీ కనిపించడం లేదు! రాజకీయ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కూడా అంతే ముఖ్యం. ప్రజల కష్టాలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించకుండా, వర్షం పడినప్పుడూ కనిపిస్తే బాగుంటుంది! సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు యెన్నేపల్లి–వికారాబాద్ రోడ్డును పరిశీలించి, శాశ్వతంగా డ్రైనేజీ మరియు రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ప్రజలకు కావాల్సింది హామీలు కాదు… వర్షం వచ్చినా ప్రయాణించగలిగే రోడ్డు.1
- వికారాబాద్ మహావీర్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్: బాధ్యులపై చర్యలకు SFI, CPM డిమాండ్ వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ (MBBS) మొదటి సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రకు చెందిన రోహన్ ఖాన్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు ప్రాంతీయ విభేదాలతో ర్యాగింగ్, దాడికి పాల్పడటం పట్ల SFI, DYFI, CPM ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.సహచరుల అవమానాలు, దాడులు భరించలేక రోహన్ ఖాన్ రాత్రికి రాత్రే మహారాష్ట్రకు వెళ్ళిపోగా, తాజాగా తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తిరిగి కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కళాశాల యాజమాన్యం మరియు పోలీసులను కలిసి, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల ప్రధాన డిమాండ్లు: అవగాహన సదస్సులు:కళాశాలలో చదువుతున్న 300 మందికి పైగా విద్యార్థులకు ర్యాగింగ్, దాడులు, దౌర్జన్యాలు, అలాగే గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలి. కఠిన పర్యవేక్షణ: విద్యార్థుల మధ్య ప్రాంతీయ తగాదాలను అరికట్టేందుకు, బాలికలు మరియు బాలుర హాస్టళ్లపై యాజమాన్యం, పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలి. యాజమాన్య బాధ్యత: కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భద్రతకు పూర్తి పూచీకత్తు వహించాలని SFI జిల్లా ఉపాధ్యక్షులు తేజా బాయ్, CPM జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు. چنین ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.1
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణపతి హోమం కార్యక్రమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మరకత జీవనజ్యోతి లింగాలయం వద్ద తొమ్మిదో రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.1
- రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? *ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.1