logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

8 hrs ago
user_S M S
S M S
Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
8 hrs ago

కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

More news from తెలంగాణ and nearby areas
  • కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
    1
    కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • మిషన్ భగీరథ నీటి మురికిని అరికట్టి పరిశుభ్రం నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుంది పరిశుభ్రంగా అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సమీపంలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా మురికిగా కంపువాసన వస్తుందని కాలిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మురికి నీరు కాకుండా పరిశుభ్రమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    మిషన్ భగీరథ నీటి మురికిని అరికట్టి పరిశుభ్రం నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు
మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుంది పరిశుభ్రంగా అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సమీపంలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా మురికిగా కంపువాసన  వస్తుందని కాలిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మురికి నీరు కాకుండా పరిశుభ్రమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    11 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు 
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • యెన్నేపల్లి–వికారాబాద్ మెయిన్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి అవసరం. వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు చేరడం కాదు… రోడ్డు ఎక్కడుంది, నది ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి! రోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇదే రోడ్డుపై మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే… రోడ్డు మాత్రం అందరికీ కనిపిస్తోంది, సమస్య మాత్రం ఎవరికీ కనిపించడం లేదు! రాజకీయ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కూడా అంతే ముఖ్యం. ప్రజల కష్టాలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించకుండా, వర్షం పడినప్పుడూ కనిపిస్తే బాగుంటుంది! సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు యెన్నేపల్లి–వికారాబాద్ రోడ్డును పరిశీలించి, శాశ్వతంగా డ్రైనేజీ మరియు రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ప్రజలకు కావాల్సింది హామీలు కాదు… వర్షం వచ్చినా ప్రయాణించగలిగే రోడ్డు.
    1
    యెన్నేపల్లి–వికారాబాద్ మెయిన్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి అవసరం.
వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు చేరడం కాదు…
రోడ్డు ఎక్కడుంది, నది ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి! 
రోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
చిన్న వర్షానికే రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
ఇదే రోడ్డుపై మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు.
కానీ ఆశ్చర్యం ఏమిటంటే…
రోడ్డు మాత్రం అందరికీ కనిపిస్తోంది, సమస్య మాత్రం ఎవరికీ కనిపించడం లేదు! 
రాజకీయ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కూడా అంతే ముఖ్యం.
ప్రజల కష్టాలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించకుండా, వర్షం పడినప్పుడూ కనిపిస్తే బాగుంటుంది!
సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు యెన్నేపల్లి–వికారాబాద్ రోడ్డును పరిశీలించి, శాశ్వతంగా డ్రైనేజీ మరియు రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను.
ప్రజలకు కావాల్సింది హామీలు కాదు… వర్షం వచ్చినా ప్రయాణించగలిగే రోడ్డు.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    2 hrs ago
  • వికారాబాద్ మహావీర్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్: బాధ్యులపై చర్యలకు SFI, CPM డిమాండ్ వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ (MBBS) మొదటి సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రకు చెందిన రోహన్ ఖాన్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు ప్రాంతీయ విభేదాలతో ర్యాగింగ్, దాడికి పాల్పడటం పట్ల SFI, DYFI, CPM ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.సహచరుల అవమానాలు, దాడులు భరించలేక రోహన్ ఖాన్ రాత్రికి రాత్రే మహారాష్ట్రకు వెళ్ళిపోగా, తాజాగా తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తిరిగి కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కళాశాల యాజమాన్యం మరియు పోలీసులను కలిసి, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల ప్రధాన డిమాండ్లు: అవగాహన సదస్సులు:కళాశాలలో చదువుతున్న 300 మందికి పైగా విద్యార్థులకు ర్యాగింగ్, దాడులు, దౌర్జన్యాలు, అలాగే గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలి. కఠిన పర్యవేక్షణ: విద్యార్థుల మధ్య ప్రాంతీయ తగాదాలను అరికట్టేందుకు, బాలికలు మరియు బాలుర హాస్టళ్లపై యాజమాన్యం, పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలి. యాజమాన్య బాధ్యత: కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భద్రతకు పూర్తి పూచీకత్తు వహించాలని SFI జిల్లా ఉపాధ్యక్షులు తేజా బాయ్, CPM జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు. چنین ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.
    1
    వికారాబాద్ మహావీర్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్: బాధ్యులపై చర్యలకు SFI, CPM డిమాండ్
వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ (MBBS) మొదటి సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రకు చెందిన రోహన్ ఖాన్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు ప్రాంతీయ విభేదాలతో ర్యాగింగ్, దాడికి పాల్పడటం పట్ల SFI, DYFI, CPM ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.సహచరుల అవమానాలు, దాడులు భరించలేక రోహన్ ఖాన్ రాత్రికి రాత్రే మహారాష్ట్రకు వెళ్ళిపోగా, తాజాగా తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తిరిగి కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కళాశాల యాజమాన్యం మరియు పోలీసులను కలిసి, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాసంఘాల ప్రధాన డిమాండ్లు:
అవగాహన సదస్సులు:కళాశాలలో చదువుతున్న 300 మందికి పైగా విద్యార్థులకు ర్యాగింగ్, దాడులు, దౌర్జన్యాలు, అలాగే గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలి.
కఠిన పర్యవేక్షణ: విద్యార్థుల మధ్య ప్రాంతీయ తగాదాలను అరికట్టేందుకు, బాలికలు మరియు బాలుర హాస్టళ్లపై యాజమాన్యం, పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలి.
యాజమాన్య బాధ్యత: కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భద్రతకు పూర్తి పూచీకత్తు వహించాలని SFI జిల్లా ఉపాధ్యక్షులు తేజా బాయ్, CPM జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు. چنین ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.
    user_Sudhakar yadav
    Sudhakar yadav
    ధారూర్, వికారాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    1
    పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్..............
టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే 
మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    4 hrs ago
  • 39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.
    1
    39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు
మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో లైవ్ కుస్తీ పోటీలు.టికెట్ లేదు, టైమింగ్ లేదు..మందు కొడితే చాలు, రోడ్డే రింగ్ అయింది.
    1
    వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో లైవ్ కుస్తీ పోటీలు.టికెట్ లేదు, టైమింగ్ లేదు..మందు కొడితే చాలు, రోడ్డే రింగ్ అయింది.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.