Shuru
Apke Nagar Ki App…
కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
Bhaskar Reddy
కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
More news from తెలంగాణ and nearby areas
- ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన మానవ తప్పిదం కారణంగానే జరిగిందని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారని కవిత పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే సమాచారం ఉందన్నారు. ముగ్గురు చిన్నారులు మృతి చెందినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస ఆర్థిక సాయం కూడా అందించలేదని ఆమె ఆరోపించారు. మృతుల్లో ఇద్దరు మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు, ఒకరు ఆదివాసీ కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలిపారు. అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.1
- వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు... ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.1
- ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి1
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణపతి హోమం కార్యక్రమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మరకత జీవనజ్యోతి లింగాలయం వద్ద తొమ్మిదో రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.1
- ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు1
- గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.1