ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.1
- మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.1
- రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? *ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.1
- ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯1
- 39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.1
- శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.1