Shuru
Apke Nagar Ki App…
తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
Sraya
తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.1
- మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.1
- కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.1
- వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు... ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.1
- రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.1
- పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది4
- శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- 39 ఏళ్లుగా కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా వినాయక పూజలు మల్కాజిగిరిలోని కృపానంద్ అపార్ట్‌మెంట్స్‌లో 39 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులుగా పిల్లలు, మహిళలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మాత అమృతానందమయి దేవి ఆశ్రమం నుంచి శ్రీమాత స్వామి సువిద్య ప్రాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాదేవి పూజ, మెడిటేషన్, భారీ భజన కార్యక్రమంతో పాటు దీపాలంకరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవి ఆశీర్వాదం పొందారు.1
- తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.1