logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? *ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

9 hrs ago
user_Master Narender
Master Narender
ఫరూఖ్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
9 hrs ago

రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? *ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

More news from Telangana and nearby areas
  • మిషన్ భగీరథ నీటి మురికిని అరికట్టి పరిశుభ్రం నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుంది పరిశుభ్రంగా అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సమీపంలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా మురికిగా కంపువాసన వస్తుందని కాలిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మురికి నీరు కాకుండా పరిశుభ్రమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    మిషన్ భగీరథ నీటి మురికిని అరికట్టి పరిశుభ్రం నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు
మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుంది పరిశుభ్రంగా అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సమీపంలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా మురికిగా కంపువాసన  వస్తుందని కాలిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మురికి నీరు కాకుండా పరిశుభ్రమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    12 hrs ago
  • వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు... ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.
    1
    వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు...
ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    11 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు 
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    1
    పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్..............
టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే 
మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    4 hrs ago
  • ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన మానవ తప్పిదం కారణంగానే జరిగిందని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారని కవిత పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే సమాచారం ఉందన్నారు. ముగ్గురు చిన్నారులు మృతి చెందినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస ఆర్థిక సాయం కూడా అందించలేదని ఆమె ఆరోపించారు. మృతుల్లో ఇద్దరు మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు, ఒకరు ఆదివాసీ కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలిపారు. అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
    1
    ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: టిఆర్ఎస్ చీఫ్ కవిత
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన మానవ తప్పిదం కారణంగానే జరిగిందని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారని కవిత పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే సమాచారం ఉందన్నారు.
ముగ్గురు చిన్నారులు మృతి చెందినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస ఆర్థిక సాయం కూడా అందించలేదని ఆమె ఆరోపించారు. మృతుల్లో ఇద్దరు మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు, ఒకరు ఆదివాసీ కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలిపారు. అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ పరార్. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పారిపోయిన రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి పారిపోయిన శివశంకర్ రెడ్డి. నిందితుడు గతంలోనూ జైలు నుండి పారిపోయినట్టు తెలిపిన అధికారులు. శివశంకర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, జైలు అధికారులు.
    2
    చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ పరార్.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పారిపోయిన రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి.
చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది.
ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి పారిపోయిన శివశంకర్ రెడ్డి.
నిందితుడు గతంలోనూ జైలు నుండి పారిపోయినట్టు తెలిపిన అధికారులు.
శివశంకర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, జైలు అధికారులు.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    7 hrs ago
  • శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
    1
    కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
కాప్రా, కుషాయిగూడ, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి రహదారులు జలమయంగా మారాయి.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్దకు వచ్చిన భక్తులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మండపాల వద్ద భక్తులు తడవకుండా నిర్వాహకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో లైవ్ కుస్తీ పోటీలు.టికెట్ లేదు, టైమింగ్ లేదు..మందు కొడితే చాలు, రోడ్డే రింగ్ అయింది.
    1
    వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో లైవ్ కుస్తీ పోటీలు.టికెట్ లేదు, టైమింగ్ లేదు..మందు కొడితే చాలు, రోడ్డే రింగ్ అయింది.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.