logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యెన్నేపల్లి–వికారాబాద్ మెయిన్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి అవసరం. వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు చేరడం కాదు… రోడ్డు ఎక్కడుంది, నది ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి! రోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇదే రోడ్డుపై మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే… రోడ్డు మాత్రం అందరికీ కనిపిస్తోంది, సమస్య మాత్రం ఎవరికీ కనిపించడం లేదు! రాజకీయ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కూడా అంతే ముఖ్యం. ప్రజల కష్టాలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించకుండా, వర్షం పడినప్పుడూ కనిపిస్తే బాగుంటుంది! సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు యెన్నేపల్లి–వికారాబాద్ రోడ్డును పరిశీలించి, శాశ్వతంగా డ్రైనేజీ మరియు రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ప్రజలకు కావాల్సింది హామీలు కాదు… వర్షం వచ్చినా ప్రయాణించగలిగే రోడ్డు.

3 hrs ago
user_ఏబ్బనూర్ అంజిలయ్య
ఏబ్బనూర్ అంజిలయ్య
Electrician Dharur, Vikarabad•
3 hrs ago

యెన్నేపల్లి–వికారాబాద్ మెయిన్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి అవసరం. వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు చేరడం కాదు… రోడ్డు ఎక్కడుంది, నది ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి! రోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇదే రోడ్డుపై మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రయాణిస్తూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే… రోడ్డు మాత్రం అందరికీ కనిపిస్తోంది, సమస్య మాత్రం ఎవరికీ కనిపించడం లేదు! రాజకీయ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కూడా అంతే ముఖ్యం. ప్రజల కష్టాలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించకుండా, వర్షం పడినప్పుడూ కనిపిస్తే బాగుంటుంది! సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు యెన్నేపల్లి–వికారాబాద్ రోడ్డును పరిశీలించి, శాశ్వతంగా డ్రైనేజీ మరియు రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ప్రజలకు కావాల్సింది హామీలు కాదు… వర్షం వచ్చినా ప్రయాణించగలిగే రోడ్డు.

More news from Telangana and nearby areas
  • మిషన్ భగీరథ నీటి మురికిని అరికట్టి పరిశుభ్రం నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుంది పరిశుభ్రంగా అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సమీపంలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా మురికిగా కంపువాసన వస్తుందని కాలిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మురికి నీరు కాకుండా పరిశుభ్రమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    మిషన్ భగీరథ నీటి మురికిని అరికట్టి పరిశుభ్రం నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు
మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తుంది పరిశుభ్రంగా అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సమీపంలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా మురికిగా కంపువాసన  వస్తుందని కాలిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మురికి నీరు కాకుండా పరిశుభ్రమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    12 hrs ago
  • రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? *ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
    1
    రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా?
*ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం*
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
    user_Master Narender
    Master Narender
    ఫరూఖ్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు 
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
    1
    కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు
కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
    user_S M S
    S M S
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
    1
    గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన 
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
    1
    ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి 
ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త
నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో
కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు
కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు
నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో?
నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు
ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ
ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు
* మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    6 hrs ago
  • చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ పరార్. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పారిపోయిన రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి పారిపోయిన శివశంకర్ రెడ్డి. నిందితుడు గతంలోనూ జైలు నుండి పారిపోయినట్టు తెలిపిన అధికారులు. శివశంకర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, జైలు అధికారులు.
    2
    చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ పరార్.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పారిపోయిన రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి.
చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది.
ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి పారిపోయిన శివశంకర్ రెడ్డి.
నిందితుడు గతంలోనూ జైలు నుండి పారిపోయినట్టు తెలిపిన అధికారులు.
శివశంకర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, జైలు అధికారులు.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    7 hrs ago
  • శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయలు మన దుర్గా భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ
కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.