logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో న్యాయం చేయాలి అర్హులైన వారికి ఇళ్లు దక్కలేదని తక్కెడ్లపాడ్ గ్రామస్తుల ఆందోళన తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ శాలిగౌరారం: తక్కెడ్లపాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అర్హులైన తమకు ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి 2003–04 సంవత్సరంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పొందిన వారిని కలిసి, వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, “నాదే భరోసా” అని చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు శాలిగౌరారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసి, తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మోదల రాంబాబు, తిరుపారి రామ్మూర్తితో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

1 hr ago
user_CHERUKU RAMESH
CHERUKU RAMESH
Occupational therapist శాలిగౌరారం, నల్గొండ, తెలంగాణ•
1 hr ago

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో న్యాయం చేయాలి అర్హులైన వారికి ఇళ్లు దక్కలేదని తక్కెడ్లపాడ్ గ్రామస్తుల ఆందోళన తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ శాలిగౌరారం: తక్కెడ్లపాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అర్హులైన తమకు ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి 2003–04 సంవత్సరంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పొందిన వారిని కలిసి, వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, “నాదే భరోసా” అని చెప్పారని గ్రామస్తులు తెలిపారు.

c8c0f6d1-e8b7-441c-b308-35f68e22d513

అయితే ప్రస్తుతం జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు శాలిగౌరారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసి, తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మోదల రాంబాబు, తిరుపారి రామ్మూర్తితో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ ప్రజలకు అద్భుతమైన విహార స్థలం 'ఈదుల పూసపల్లి చెరువు.... ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22..... కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు ఈరోజు ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పర్యాటకులకు సకల సౌకర్యాలు..... చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు (ఐలాండ్స్) ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ యోగా సెంటర్లు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్ మరియు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర బ్రహ్మాండమైన నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం "నభూతో నభవిష్యత్" అనేలా ఉందని ఆయన అభివర్ణించారు. మ్రానుకోట చారిత్రక నేపథ్యం.... పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కాబట్టి దీనికి 'మ్రానుకోట' అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోట, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని ఆయన గుర్తు చేశారు. మ్రానుకోట అసలు సిసలు రూపం ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన... ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్ఓ (DFO) తో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ 'మినీ జూ పార్క్' ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి:... మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వందలాది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో, చుట్టూ రింగ్ రోడ్డు మరియు అనుసంధాన రహదారుల నిర్మాణలతో మహబూబాబాద్‌ను మరింత వేగవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ప్రజలకు విజ్ఞప్తి: మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ గడపాలని సూచించారు. ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు స్పష్టం చేశారు.
    1
    మహబూబాబాద్ ప్రజలకు అద్భుతమైన విహార స్థలం 'ఈదుల పూసపల్లి చెరువు.... 
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. 
మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22..... 
కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు ఈరోజు ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
పర్యాటకులకు సకల సౌకర్యాలు..... 
చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు (ఐలాండ్స్) ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ యోగా సెంటర్లు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్ మరియు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర బ్రహ్మాండమైన నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం "నభూతో నభవిష్యత్" అనేలా ఉందని ఆయన అభివర్ణించారు.
మ్రానుకోట చారిత్రక నేపథ్యం.... 
పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కాబట్టి దీనికి 'మ్రానుకోట' అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోట, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని ఆయన గుర్తు చేశారు. మ్రానుకోట అసలు సిసలు రూపం ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. 
మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన... 
ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్ఓ (DFO) తో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ 'మినీ జూ పార్క్' ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి:... 
మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వందలాది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో, చుట్టూ రింగ్ రోడ్డు మరియు అనుసంధాన రహదారుల నిర్మాణలతో మహబూబాబాద్‌ను మరింత వేగవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. 
ప్రజలకు విజ్ఞప్తి:
మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ గడపాలని సూచించారు. ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు స్పష్టం చేశారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.
    1
    శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి  గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    1
    ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ 
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    16 hrs ago
  • రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* *రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?* 1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో. 2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. 3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది. 4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు. 5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన. 6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు. 7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు. 8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది. 9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది. 10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి. 11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది. 12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి. 13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది. 14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది. 16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది. 17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు. 18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది. 19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం. 20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.
    1
    రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?*
*రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు పంచితే, KCR 440 ఎకరాలు ఎట్లా కొన్నడు - అసలు జాతిపిత ఎవరు?*
1. తెలంగాణ జాతిపిత మా KCR అని చెప్పుకు తిరిగే ప్రతి చెంచాకి అంకితం ఈ వీడియో.
2. అసలు తెలంగాణ సాయుధ పోరాటం వీరుడు రావి నారాయణ రెడ్డి గురించి వీళ్లకు తెలుసా అని ప్రశ్నిస్తుంది.
3. చండ్రా వంకల అసలు పొగాకు నోట్ల కట్టల సంగతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గురించి గుర్తు చేస్తుంది.
4. ఒకప్పుడు రావి నారాయణ రెడ్డి పేదల ఆకలి కేకలు చూసి తన సొంత 500 ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా పంచిపెట్టిండు.
5. 1951-52 లో నల్గొండ MP గా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలంగాణ జనాల నిజమైన హీరో ఆయన.
6. ఆయనకు నీరాజనాలు పట్టిన ప్రజలు, ఆయన చివరి దశలో కర్ర సాయంతో నడిచినా అదే ఇంట్లోనే 1991 సెప్టెంబర్ 7న కన్నుమూశాడు.
7. ఆయనే నిజమైన తెలంగాణ కోసం త్యాగం చేసిన నాయకుడు.
8. మరి దళిత బంధుకు 10 లక్షలు ఇవ్వని, తెలంగాణ జనాలను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎట్లా అవుతాడు అని వీడియో నిలదీస్తుంది.
9. ఇక అసలు విషయానికి వస్తే, 2023 అఫిడవిట్ లెక్క ప్రకారం KCR కుటుంబ భూముల లెక్కలు బయటపెట్టింది.
10. KTR పేరు మీద 67 ఎకరాలు, కొడుకు KTR పేరు మీద 49 ఎకరాలు ఉన్నాయి.
11. ఆయన భార్య శైలజమ్మ పేరు మీద 17 ఎకరాల భూమి ఉంది.
12. హిమాన్షు రావు పేరు మీద 46 ఎకరాలు, కవిత పేరు మీద 37 ఎకరాలు ఉన్నాయి.
13. వీడియోలో చూపినట్టు ఎర్రవల్లి ఫాం హౌస్ ఒక్కటే 67 ఎకరాల్లో ఉంది.
14. చుట్టూ కాంపౌండ్ వాల్ తో, లోపల విలాసవంతమైన భవనంతో మొత్తం 700 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
15. అందులో 388 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉంది.
16. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి, KCR కొన్న భూమి - తేడా ఇక్కడే తెలుస్తుంది.
17. ఒకరు ఇచ్చేవాడు, ఒకరు లాక్కునేవాడు.
18. KCR కుటుంబం మొత్తం కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సమాజం ముందు దొంగగా నిలబడిందని వీడియో చెబుతుంది.
19. తెలంగాణ తెచ్చింది KCR కాదు, తెలంగాణ జనాల త్యాగం, రావి నారాయణ రెడ్డి లాంటి వీరుల పోరాటం.
20. కాబట్టి తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి లాంటి త్యాగధనులే, భూములు దోచుకున్న దొరలు కాదు అనేది ఈ వీడియో సందేశం.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్... పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి కార్లపై రాళ్ల దాడి తిరుమలాయపాలెం మండలం సిద్ధండ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఘటన తిరుమలయపాలెం :21/09/2026 తిరుమలాయపాలెంలంలోని సుద్దవాగు తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తంబూరు దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి. తండలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి హాజరైన తిరిగి వస్తున్నసమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు .అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
    1
    బ్రేకింగ్ న్యూస్... పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి కార్లపై రాళ్ల దాడి 

 తిరుమలాయపాలెం మండలం సిద్ధండ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఘటన 
తిరుమలయపాలెం :21/09/2026
తిరుమలాయపాలెంలంలోని సుద్దవాగు తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో  పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తంబూరు  దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి. తండలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి హాజరైన తిరిగి వస్తున్నసమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు  .అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం చేసిన కృషిలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అమోఘమని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనియాడారు: వంగవీటి
    1
    నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం  చేసిన కృషిలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అమోఘమని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనియాడారు: వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    23 hrs ago
  • అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలని రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో,ధర్నా చేసిన నిరుపేద కుటుంబాలు.
    1
    అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలని రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో,ధర్నా చేసిన నిరుపేద కుటుంబాలు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు. _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.
    1
    _నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు  ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.
_నిమజ్జనం_చేసే_పద్ధతి ... DJ పెట్టుకుని బట్టలు  ఊడిఇదిపోతున్న గెంతులు వేయడం మాత్రం కాదు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా 2014 నుండి కేంద్రం ప్రభుత్వ అవార్డులు ప్రకటించిన విషయంలో క్షేత్రస్థాయిలో అనేక సేవలు చేసిన వారికే గుర్తింపు ఇచ్చి అవార్డులు ప్రకటించిన విషయం చాలా గొప్ప విషయంగా చెప్పారు: వంగవీటి
    1
    శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా  2014 నుండి కేంద్రం ప్రభుత్వ అవార్డులు ప్రకటించిన విషయంలో క్షేత్రస్థాయిలో అనేక సేవలు చేసిన వారికే గుర్తింపు ఇచ్చి అవార్డులు ప్రకటించిన విషయం చాలా గొప్ప విషయంగా చెప్పారు: వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.