మహబూబాబాద్ ప్రజలకు అద్భుతమైన విహార స్థలం 'ఈదుల పూసపల్లి చెరువు.... ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22..... కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు ఈరోజు ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పర్యాటకులకు సకల సౌకర్యాలు..... చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు (ఐలాండ్స్) ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ యోగా సెంటర్లు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్ మరియు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర బ్రహ్మాండమైన నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం "నభూతో నభవిష్యత్" అనేలా ఉందని ఆయన అభివర్ణించారు. మ్రానుకోట చారిత్రక నేపథ్యం.... పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కాబట్టి దీనికి 'మ్రానుకోట' అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోట, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని ఆయన గుర్తు చేశారు. మ్రానుకోట అసలు సిసలు రూపం ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన... ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్ఓ (DFO) తో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ 'మినీ జూ పార్క్' ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి:... మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వందలాది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో, చుట్టూ రింగ్ రోడ్డు మరియు అనుసంధాన రహదారుల నిర్మాణలతో మహబూబాబాద్‌ను మరింత వేగవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ప్రజలకు విజ్ఞప్తి: మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ గడపాలని సూచించారు. ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు స్పష్టం చేశారు.

- మహబూబాబాద్ ప్రజలకు అద్భుతమైన విహార స్థలం 'ఈదుల పూసపల్లి చెరువు.... ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22..... కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు ఈరోజు ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పర్యాటకులకు సకల సౌకర్యాలు..... చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు (ఐలాండ్స్) ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ యోగా సెంటర్లు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్ మరియు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర బ్రహ్మాండమైన నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం "నభూతో నభవిష్యత్" అనేలా ఉందని ఆయన అభివర్ణించారు. మ్రానుకోట చారిత్రక నేపథ్యం.... పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కాబట్టి దీనికి 'మ్రానుకోట' అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోట, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని ఆయన గుర్తు చేశారు. మ్రానుకోట అసలు సిసలు రూపం ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన... ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్ఓ (DFO) తో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ 'మినీ జూ పార్క్' ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి:... మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వందలాది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో, చుట్టూ రింగ్ రోడ్డు మరియు అనుసంధాన రహదారుల నిర్మాణలతో మహబూబాబాద్‌ను మరింత వేగవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ప్రజలకు విజ్ఞప్తి: మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ గడపాలని సూచించారు. ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు స్పష్టం చేశారు.1
- * సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ... * గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం.... మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....2
- నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.1
- మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి మూడో రైల్వే లైన్ మహబూబాబాద్ జిల్లా: కాజీపేట నుండి విజయవాడకు219 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ అందుబాటులోకి వచ్చింది.. నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.. న్యూఢిల్లీ-చెన్నై మధ్య ఉన్న ఈ గ్రాండ్ ట్రంక్ లైన్ పై విపరీతమైన రైళ్ల రద్దీ ఉండడంతో ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే ట్రాక్‌ల లైన్లు సరిపోకపోవడంతో మూడో లైన్ నిర్మాణ పనులను పదేళ్ల క్రితం ప్రారంభించింది .. ఇందులో మహబూబాబాద్ నుండి కాజీపేట సెక్షన్‌ల మధ్య ఉన్న పనులు ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో మూడో లైన్‌పై నుంచి రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నారు.. . ఇక రైళ్ల రాకపోకలు నిర్ణీత సమయంలో కొనసాగేందుకు అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తోంది...1
- వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి? దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం: ఎర్రబెల్లి. వరంగల్, సెప్టెంబర్ 22: ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటనపై వారిని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని దాడి చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనలో ముగ్గురు గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన అనంతరం ఆస్పత్రిలో పరిస్థితులను అధికారులు పరిశీలించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వినయ్ భాస్కర్‌ను అడ్డుకుని పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు పోలీసులు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల విషయంలోనూ పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్న ఘటనలపై పార్టీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తా కథనాలు కూడా ఉన్నాయి. “కార్యకర్తలు అధైర్యపడొద్దు” ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడే నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.1
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం......... BRS మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేయి విరిగిందంటూ కంటతడి పెట్టుకున్న వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకున్న పోలీసులు పోలీసులు....1
- డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 'డ్రా' రద్దు చేయాలి: రోడ్డుపై రాస్తారోకో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన డ్రా సిస్టమ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు మంగళవారం రోడ్డు పై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించాయి. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను, ఇండ్లు లేని కూలీలను పక్కనబెట్టి అర్హత లేని వారికి డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని వారు మండిపడ్డారు. కలెక్టర్ జారీ చేసిన ప్రస్తుత డ్రా విధానం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ – అధికారుల వేచిచూసే ధోరణి: బాధిత కుటుంబాలు రోడ్డుపై ఇండ్ల సామాగ్రి, వంట పాత్రలతో బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. "న్యాయం జరిగే వరకు కదిలేది లేదు" అంటూ నిరుపేదలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హుల జాబితాను పునఃసమీక్షించి, క్షేత్రస్థాయిలో నిజమైన పేదలను గుర్తించిన తర్వాతే ఇండ్ల కేటాయింపు జరపాలని వారు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిరుపేదలు స్పష్టం చేయడంతో గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- * CEIR ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. 77 ఫోన్లు బాధితులకు అప్పగింత.... “మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి” * జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ *మహబూబాబాద్ జిల్లా పోలీస్... *ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా 2027 మొబైల్ ఫోన్ల రికవరీ.... * 77 ఫోన్లను గుర్తించి ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్. చేతులమిదిగా బాధితులకు అందజేత..... * CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి... * జిల్లా ఎస్పీ డా. శబరీష్. ఐపీఎస్.... పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ చేతులమిదిగా అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... CEIR పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ ప్రక్రియలో మహబూబాబాద్ డీఎస్పీ, CCS ఇన్‌స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్‌ఐ జి.వి. కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, CEIR ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి ఫోన్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు. ప్రజల ఆస్తి పరిరక్షణలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.....2