Shuru
Apke Nagar Ki App…
హసన్‌పల్లిలో హెల్త్ క్యాంప్.. . 4 మందికి వైద్య పరీక్షలు... మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.గ్రామ ప్రజలకు జ్వరం తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సులోచన, అంజలి ప్రజలకు సుమారు 40 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఎస్ మంగలి రాములు,హరిజన్ ఆశా వర్కర్లు సావిత్రి, పద్మ,లక్ష్మి,తదితరులు ఉన్నారు.
Abdul Raheem
హసన్‌పల్లిలో హెల్త్ క్యాంప్.. . 4 మందికి వైద్య పరీక్షలు... మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.గ్రామ ప్రజలకు జ్వరం తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సులోచన, అంజలి ప్రజలకు సుమారు 40 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఎస్ మంగలి రాములు,హరిజన్ ఆశా వర్కర్లు సావిత్రి, పద్మ,లక్ష్మి,తదితరులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హసన్‌పల్లిలో హెల్త్ క్యాంప్.. . 4 మందికి వైద్య పరీక్షలు... మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ బోయిని హరిన్‌కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.గ్రామ ప్రజలకు జ్వరం తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సులోచన, అంజలి ప్రజలకు సుమారు 40 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఎస్ మంగలి రాములు,హరిజన్ ఆశా వర్కర్లు సావిత్రి, పద్మ,లక్ష్మి,తదితరులు ఉన్నారు.4
- అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.1
- గోశాలలు–ఆశ్రమాల సందర్శనతో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు విస్తరణ గోమాతల సేవతో పాటు విద్యార్థులకు పాఠ్య సామగ్రి పంపిణీ – సమాజ సేవలో ముందంజ బోధన్ డివిజన్ లో చేయూత గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ సమీప అంబం(ఆర్) గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ఆంజనేయ గోశాలను సభ్యులు సందర్శించారు. సుమారు 12 నంది, గోమాతలతో కొనసాగుతున్న ఈ గోశాల పురాతన బురుజు ప్రాంగణంలో మహాదేవుని సన్నిధిలో నెలకొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రూపు సభ్యులు గోమాతలకు ఆహారంగా బెల్లం, పచ్చి శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు తినిపించారు. అనంతరం గో సంరక్షణ ప్రాముఖ్యత, చేయూత గ్రూపు కార్యకలాపాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గోశాల అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్లెపు గంగాధర్ (సర్పంచ్)తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల, అనాధ–పేద విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించారు. సహజ వాతావరణంలో విస్తరించిన ఈ ఆశ్రమంలో గోమాతలను పరిశీలించిన సభ్యులు వాటికి ఆహారంగా తీసుకువచ్చిన బెల్లం, శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు అందజేశారు. ఆశ్రమంలో స్వయం సమృద్ధిగా పండించే కూరగాయలు, ధాన్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి 19 మంది విద్యార్థులకు శ్రీమద్భగవద్గీత గ్రంథాలు, టావెల్స్, ఎగ్జామ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, నడవడికను సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమాల్లో చేయూత గ్రూపు వ్యవస్థాపకుడు నందల శంకర్ ఆధ్వర్యంలో సిందే సురేష్, బోడ నరహరి, భేతి సాయిలు, మురళి పాల్గొన్నారు. ఆశ్రమ సూపరింటెండెంట్, మేనేజర్ సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి2
- 97go రద్దుచేయాలనిరాందాస్చౌరాస్తావద్దనిరసనర్యాలీలోపాల్గోన్న బిజేపి, బిజేవైఎం నాయకులు సత్తీష్ పాటిల్, గడ్డం శ్రీనివాస్ శక్తి వద్దు పాలిటెక్నిక్ ముద్దు పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తోసుకోచిన్న జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలనినిర్వహిస్తున్న నిరసనకు మెదక్ బిజెపి పూర్తి మద్దతు తెలపడం జరిగింది...1
- మెదక్ : 20వ వార్డులో వీధి కుక్కల స్వైర విహారం పట్టించుకొని అధికారులు మెదక్ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులు, కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ ట్రాప్‌తో కలకలం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి, రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది. పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ పనుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.1
- అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 22: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చౌరస్తా వద్ద ఉన్న అభి పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి చందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పాఠశాలకు చేరుకుని 9, 10వ తరగతులు నిర్వహిస్తున్న గదులను సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. పాఠశాల యాజమాన్యానికి గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి సీఆర్-5 న్యూస్ ఛానల్‌కు వెల్లడించినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన అనుమతులు లేకుండా 9, 10వ తరగతుల్లో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల చదువు, పరీక్షలు, తదుపరి విద్యకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.1
- లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడిస్తూ మాట్లాడుతూ, ఫిర్యాదురాలు చింతకుంట చంద్రవ్వ, భర్త హనుమంతు, లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందినవారు. ఫిర్యాదురాలి కుమార్తె గత 10 సంవత్సరాలుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్యతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ వద్ద ఉన్న సమయంలో సాయిలు తన గ్రామానికి రావాలని బలవంతం చేస్తూ, రాకపోతే చంపేస్తానని పలుమార్లు ఫోన్‌లో బెదిరించినట్లు ఫిర్యాదురాలు తెలిపింది. ఈ క్రమంలో తేదీ 18.09.2026న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి ఆమె కుమార్తె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది. అనంతరం నాగారం గ్రామ శివారులో తలకు బలమైన గాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో ఫిర్యాదురాలు లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టగా నిందితుడు గుట్టమీది సాయిలు, తండ్రి గంగయ్య, వయస్సు 48 సంవత్సరాలు, కొరుపోలు గ్రామం, లింగంపేట్ మండలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, తేదీ 19.09.2026 ఉదయం సుమారు 11.00 గంటలకు భూమి డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్‌తో మాట్లాడించాడు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు సాయంత్రం సుమారు 5.00 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు గుట్టమీది సాయిలును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉంది. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ . రాజేష్ చంద్ర, అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.1