సీనియర్ ముఖ్య కార్యకర్తకు నివాళులు అర్పించిన యువ నాయకులు రామకృష్ణ రెడ్డి,మండల అధ్యక్షులు సురేష్ నాయుడు. మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ యువ కార్యకర్త ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్యూషన్ వైస్ చైర్మన్ చంద్ర గారి తండ్రి వర్యులు చింతకుంట భీమయ్య గారు వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.వారి గ్రామానికి వెళ్ళి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి శాంతిని కాంక్షిస్తూ ధైర్యంగా ఉండాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు లక్ష్మయ్య,వెంకటేష్,లక్ష్మన్న, ముత్తు, రంగస్వామి, జయరాం వేమిరెడ్డి మొదలగు వారు పాల్గొనడం జరిగినది.నూతనంగా నిర్మించనున్న బదినేహళ్ గ్రామ పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఆర్థిక సహాయం అందచేసిన యువ నాయకులు సురేష్ నాయుడు.కౌతాళం మండలం బదినేహళ్ గ్రామంలో గ్రామ నాయకుల కోరిక మేరకు నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణం కోసం 11,000 రూపాయిలు ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు నరసింహ,వీరేష్, దుర్గప్ప,ఉలిగప్ప,ముకప్ప, ముకన్న,గురు,నభి, మొదలగు వారు పాల్గొనడం జరిగినది

- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1