Shuru
Apke Nagar Ki App…
కాంగ్రెస్ విజయ గర్జన ర్యాలీ అస్తాం విజయ గర్జన ర్యాలీ ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి పట్టణం విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు
AlluriMahesh
కాంగ్రెస్ విజయ గర్జన ర్యాలీ అస్తాం విజయ గర్జన ర్యాలీ ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి పట్టణం విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు టెన్త్ విద్యార్థులు చేరుకుంటున్నారు. అధికారుల సూచనల మేరకు శనివారం ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా తమ హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకొని వారి కేటాయించిన పరీక్ష గదులలోకి వెళ్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.1
- Post by Solanke Ravi3
- మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.1
- కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని *కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి* నితిన్ గడ్కారీ గారిని కలిసి విన్నవించిన కామారెడ్డి *శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేయటం జరిగింది.. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారిని కలసి స్థల పరిశీలన మరియు వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి మరియు నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి గారికి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.1
- పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.1
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర ముగిసింది. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర ఆరు కిలోమీటర్లు ముందే దొంగలమర్రి వద్ద పాదయాత్రను ముగించి కారులో అంజన్న సన్నిధికి బండి సంజయ్ చేరారు. అప్పటికే రాత్రి 10 కావడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గుడి ముందే బండి సంజయ్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు పలువురు కార్పొరేటర్లతో కలిసి మొక్కలు చెల్లించారు. ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే అంజన్న ఆశీర్వాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని, అంజన్న దయతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుని ముక్కు చెల్లించేందుకు యాత్ర చేపట్టామని సంజయ్ తెలిపారు. నిబంధన ప్రకారం ఆలయాన్ని మూసివేశారని నిబంధనలు ఉల్లంఘించకుండా మూసివేసిన ఆలయం ముందే మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అంజన్న ఆశీర్వాదయాత్ర రాత్రి 10 గంటలకు సాగింది. 15 గంటల పాటు చెప్పులు వేసుకోకుండా సాక్సులతో పాదయాత్ర చేసిన బండి సంజయ్ అలసిపోయారు. ఎండవేడితో అలసిపోయి మార్గమధ్యలో కొండన్నపల్లి వద్ద చెట్టు కింద 45 నిమిషాల పాటు సేద తీరారు. మార్గమధ్యలో రామడుగు మండలం కోనరావు పేట వద్ద డ్రోన్ కెమెరాతో తేనెటీగలు లేచి అంజన్న ఆశీర్వాద యాత్ర పై దాడి చేశాయి. యాత్ర వెనకలో ఉన్న పలువురు తేనెటీగల దాడిలో అస్వస్థతకు గురికాగ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపశృతి అలసిపోయి అంజన్న సన్నిధికి చేరుకున్న బండి సంజయ్, కార్పొరేటర్లతో కలిసి అంజన్న గుడి ముందు మొక్కులు చెల్లించి అర్చకుల అశిర్వచనం తీసుకున్నారు.4
- ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi4
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.1