పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అన్నదానం - జనసేన నేత కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అన్నదానం - జనసేన నేత కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడాలని ఆకాంక్షిస్తూ పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు కోలా సోమశేఖర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమంలో తన కుటుంబ సమేతంగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన కోలా సోమశేఖర్ మాట్లాడుతూ "నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమన్నారు ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, వినూత్న పాలనతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని సోమశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోలా సోమశేఖర్ దంపతులతో పాటు స్థానికులు పాల్గొన్నారు

- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- *తల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి* పల్నాడు జిల్లా..న్యూస్. వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది రైలు ప్రమాదమా లేక హత్య కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు.1
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1
- శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.1
- మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు1
- Post by T. Raja simha1
- కుప్పం మండలం మల్లనూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వెనకాల 12 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. విద్యార్థులు భయముతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారి జయశంకర్ ఆధ్వర్యంలో కొండచిలువ పట్టుకొని. అడివిలో వదిలిపెట్టారు.1