Shuru
Apke Nagar Ki App…
స్వగ్రామానికి తొలిసారి వచ్చిన యువ ఐఏఎస్‌కు సంబరాల వాతావరణంలో ఘన స్వాగతం వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
M D Azizuddin
స్వగ్రామానికి తొలిసారి వచ్చిన యువ ఐఏఎస్‌కు సంబరాల వాతావరణంలో ఘన స్వాగతం వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.3
- Post by User4017 Budhiya Kan ke2
- బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.1
- గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం1
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు1
- నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపణ... హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని రవీంద్ర కుమార్ వ్యాఖ్య... పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శ.... కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని నేతల స్పష్టం... మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపణ... సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన... ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్... కాంగ్రెస్ హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపాటు... రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా లేదు, కరెంట్ లేదు అంటూ విమర్శలు.... ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని బీఆర్ఎస్ ప్రకటన... అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు.. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలూ చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, పార్టీ నేతలు తదితరులు.1
- వరంగల్ జిల్లా:నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదాంతమైంది. సమ్మె నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయనను ముందుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.4
- మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.1