logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం..రాష్ట్ర సివిల్ సప్లైకార్పోరేషన్ డైరెక్టర్ మురళి. బద్వేలు,ఆగస్ట్ 25: పట్టణంలోని మలకత్తువ వద్ద వున్న వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మంగళవారం బద్వేలు నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటపాటి వెంకటరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బద్వేలు నియోజవర్గంలో జనసేన పార్టీ బలాబలాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ముఖ్య అతిధిగా జనసేన నాయకుడు రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ డైరెక్టర్ తుదిమెళ్ల మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో మన శక్తిని పదిరెట్లు పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. మన బలాబలాలను అవగాహన చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ లను గెలిపించుకోగలుగుతాం అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. ఐకమత్యాన్ని పెంచుకుంటూ నూతన నాయకత్వానికి కూడా ఆహ్వానం పలికితే మరింత బలమైన శక్తిగా మారతాం అన్నారు. కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాలేకాదు, బద్వేల్ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించాల్సిన భాద్యత మనందరిమీద ఉందన్నారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్, లక్ష్యాన్ని సిద్ధాంతాన్ని నిర్మించాలంటే అందరం ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోటపాటి వెంకటేష్, షేక్ ఇమ్రాన్, సిద్దు, ఈశ్వర్ రెడ్డి లకిడి వంశీ, ఖలీల్ బాషా, చంద్ర, శ్రీకాంత్ రెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

8 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
8 hrs ago
c8f4d76d-15ed-4003-b599-e13d829430f6

ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం..రాష్ట్ర సివిల్ సప్లైకార్పోరేషన్ డైరెక్టర్ మురళి. బద్వేలు,ఆగస్ట్ 25: పట్టణంలోని మలకత్తువ వద్ద వున్న వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మంగళవారం బద్వేలు నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటపాటి వెంకటరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బద్వేలు నియోజవర్గంలో జనసేన పార్టీ బలాబలాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ముఖ్య అతిధిగా జనసేన నాయకుడు రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ డైరెక్టర్ తుదిమెళ్ల మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో మన శక్తిని పదిరెట్లు పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. మన బలాబలాలను అవగాహన చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ లను గెలిపించుకోగలుగుతాం అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. ఐకమత్యాన్ని పెంచుకుంటూ నూతన నాయకత్వానికి కూడా ఆహ్వానం పలికితే మరింత బలమైన శక్తిగా మారతాం అన్నారు. కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాలేకాదు, బద్వేల్ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించాల్సిన భాద్యత మనందరిమీద ఉందన్నారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్, లక్ష్యాన్ని సిద్ధాంతాన్ని నిర్మించాలంటే అందరం ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోటపాటి వెంకటేష్, షేక్ ఇమ్రాన్, సిద్దు, ఈశ్వర్ రెడ్డి లకిడి వంశీ, ఖలీల్ బాషా, చంద్ర, శ్రీకాంత్ రెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
    1
    బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.
బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు.
రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    1
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 

ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 
ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.
    1
    కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట.......



కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు.
ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
    1
    పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి
కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని
తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
    1
    పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం 
బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    1
    ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.
    1
    పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.
బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు.
బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు.
వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ
కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.